శ్రీయ తమన్నా డిజాస్టర్ సినిమా తెలుగులో

Shriya saran Tamannaah Bhatia Simbu AAA
Shriya saran Tamannaah Bhatia Simbu AAA

Shriya saran Tamannaah Bhatia Simbu AAA | శింబు హీరోగా శ్రియ తమన్నా హీరోయిన్లుగా కోలీవుడ్ లో తెరకెక్కిన డిజాస్టర్ సినిమా ‘AAA ‘ (అన్బాన‌వ‌న్ అస‌రాద‌వ‌న్ అడంగాద‌వ‌న్). మైఖేల్‌ రాయప్పన్ నిర్మించిన ఈ సినిమా మూడేళ్ళ క్రితం విడుదలైనా ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ సినిమా కు హీరో అసలు సహకరించలేదని, పైగా ఇబ్బంది పెట్టాడని ప్రెస్ మీట్ పెట్టి మరీ నిర్మాత ఆరోపణలు చేసాడు. దర్శకుడూ నిర్మాతకు సపోర్ట్ గా నిలవటంతో అప్పట్లో నిర్మాతల మండలి ౬.౬ కోట్లకు ఈ వివాదాన్ని సెటిల్ చేసింది. అయితే శింబు ఇంకా ఆ మొత్తం చెల్లించక పోవటంతో ఈమధ్యే నిర్మాతల మండలి శింబు ను బాన్ చేసింది.

ఇప్పుడు ఈ డిజాస్టర్ సినిమాని తెలుగులో ఈనెల 22 న విడుదల చేయనున్నారు. శింబు కోసం థియేటర్ కి వెళ్లే ఒక్క తెలుగు ప్రేక్షకుడు కూడా వుండే అవకాశం లేదు. కేవలం శ్రియ, తమన్నాల ఇమేజ్ మీద 50 శాతం తీసికెట్లతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?