రామ్ చరణ్ కియారా అద్వాని డిజాస్టర్ పెయిర్ రిపీట్ … చరిత్ర రిపీట్ అవుతుందా ?

Ramcharan kiara advani for Acharya
Ramcharan kiara advani for Acharya

Ramcharan kiara advani for Acharya | మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆచార్య. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించనున్న విషయం తెలిసిందే. మొదట గెస్ట్ రోల్ అనుకున్నా, ఇప్పుడు టైం స్పాన్ పెరగటమే కాక, ఒక డ్యూయెట్ కూడా వుండబోతుందట. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా చాలామంది పేర్లు వినిపించాయి. రష్మిక మందన్న, సమంత, పూజ హెగ్డే, అనన్య పాండే .. ఇలా ఎంతో మంది పేర్లు వినిపించాయి. అనన్య పాండే పేరైతే దాదాపు కంఫర్మ్ అని కూడా దాదాపు అన్ని పత్రికలూ ప్రచురించేసాయి.

కట్ చేస్తే కొరటాల శివ సీన్ లోకి కియారా అద్వాని ని తీసుకొచ్చినట్టు వార్తలందుతున్నాయి. రామ్ చరణ్ కియారా అద్వాని గతంలో వినయ విధేయ రామ అనే డిజాస్టర్ సినిమాలో నటించారు. అయినా మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవటం విశేషం. గతంలో కూడా బ్రూస్లీ సినిమాలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ను ధ్రువ లో రిపీట్ చేసి హిట్ కొట్టాడు రామ్ చరణ్. బహుశా ఆ సెంటిమెంట్ రిపీట్ అవుద్దనేమో?