నాలుగో భర్తను గెంటేయలేదంటున్న హీరోయిన్

వనిత విజయ్ కుమార్
వనిత విజయ్ కుమార్

మంజుల విజయ్ కుమార్ ల గురించి టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులందరికి బాగా తెలుసు. వారి పెద్ద కుమార్తె వనిత. 1995 లో విజయ్ సినిమా చంద్రలేఖ సినిమాతో తెరంగేట్రం చేసింది వనిత విజయ్ కుమార్. 2001 లో నటుడు ఆకాష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి పెటాకులు కావటం, అప్పటికే పుట్టిన పిల్లలిద్దరి కోసం కోర్టులో వనిత చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.

ఆ తరువాత ఆనంద్ జై రాజన్ అనే బిజినెస్ మాన్ ను రెండో పెళ్లి చేసుకుంది వనిత. వీళ్లిద్దరికీ ఒక కూతురు కూడా వుంది. అలవాటు ప్రకారమే 5 ఏళ్ళ కాపురం తరువాత విడాకులు తీసుకుంది.

అలాగే తండ్రి విజయ్ కుమార్ తోనూ ల్యాండ్ డిస్ప్యూట్ వున్న విషయం కూడా కోర్టు దాక వెళ్లటంతో అందరికి తెలిసిందే.

ఆ తరువాత రాబర్ట్ అనే కొరియోగ్రాఫర్ ను మూడో పెళ్లి చేసుకుంది వనిత. వీళ్లిద్దరు కలిసి ఒక సినిమా నిర్మించిన తరువాత మరోసారి విడాకులు తీసుకుంది వనిత.

లేటెస్ట్ గా ఈ సంవత్సరం జూన్ లో ఇద్దరు పిల్లల తండ్రి అయిన పీటర్ పాల్ ను నాలుగో పెళ్లి చేసుకుంది వనిత విజయ్ కుమార్. పెళ్లి అయిన వెంటనే గోవా ట్రిప్ కి వెళ్లిన వీరిద్దరూ నెట్లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

కట్ చేస్తే గోవాలో మందు ప్రభావంతో గొడవ జరిగిందని, చెన్నై రాగానే అతనిని కొట్టి గెంటేసిందని వార్తలు వచ్చాయి.

ఈ విషయంపై తాజాగా స్పందించిన వనిత, అతనిని గెంటేయలేదని, వాళ్ళింటికి వెళ్తానంటే డబ్బులు ఇచ్చి పంపానని చెపుతుంది.

గతేడాది బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ గా బాగా పాపులర్ అయింది వనిత. ఆ హౌస్ లో వున్నప్పుడు కూడా కూతురిని కిడ్నప్ చేసింది అని రెండో భర్త కేసు పెట్టడం, పోలీసులు బిగ్ బాస్ హౌస్ కి వచ్చి విచారించటం తెలిసిన విషయమే.