ఆగిపోయిన సినిమాల్లోనూ పోటీపడుతున్న చిరు బాలయ్య

చిరు బాలయ్య
చిరు బాలయ్య

మెగాస్టార్ చిరంజీవి, నటరత్న నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నోసార్లు పోటీపడ్డ విషయం అందరికీ తెలిసిందే. అనుకోకుండా అలాంటి సంఘటనే మరొకటి… సొందర్య అకాల మరణం తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలయ్య దర్శకుడిగా తెరకెక్కుతున్న నర్తనశాల చిత్రం ఆగిపోయిన విషయం తెలిసిందే.

కేవలం 17 నిమిషాల నిడివి మాత్రమే వున్న నర్తనశాల సినిమా పేఫర్ వ్యూ బేసిస్ మీద ఈరోజునుంచి శ్రేయాస్ ఈటీ లో స్ట్రీమ్ చేస్తున్నారు.

ఇదే కోవలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘అబు బాగ్దాద్ గజదొంగ’ అనే సినిమా కూడా కొంత షూటింగ్ తరువాత ఆగిపోయింది. దీనికి కారణాలేమైనా, ఇప్పుడు ఈ సినిమా కూడా ఓటిటి లో విడుదల చేస్తారనే ర్యూమర్లు గతకొంత కాలంగా వినిపిస్తున్నాయి. ఎలాగో ఇప్పుడు సొంత ఓటిటి లు అందుబాటులో వున్నాయి గనుక ఈ ర్యూమర్లు వస్తున్నాయేమో ?