టాలీవుడ్ లో రెండు భారీ చిత్రాలకు సంబంధించి ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అప్డేట్స్ రానే వచ్చాయి. నిన్న రౌద్రం రణం రుధిరం నుంచి ఎన్టీఆర్ లుక్, రాధే శ్యామ్ నుంచి ప్రభాస్ లుక్ విడుదలకాగా, ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు కానుకగా, రాధేశ్యామ్ నుంచి మోషన్ పోస్టర్ విడుదల చేసారు.
సహజంగానే పెద్ద హీరోల సినిమాలకు సంబంధించి వచ్చే వార్తలపై అందరికి ఆసక్తి ఉంటుంది. అలాగే లుక్స్, పోస్టర్స్, ట్రైలర్ విడుదల కాగానే ఇది మరోదానికి కాపీ అనో, లేక రీమేక్ అనో ఆరోపణలు రావటమూ సహజమే.
నిన్న విడుదల చేసిన ఎన్టీఆర్ లుక్ వీడియోలో కొన్ని లొకేషన్స్ నేషల్ జియోగ్రఫీ ఛానల్ లోనుంచి, మరికొన్ని ఇతర టీవీ ఛానల్స్ నుంచి కాపీ చేసినట్లు ఆధారాలతో సహా తేల్చేసారు నెటిజన్లు.
అలాగే ఈరోజు విడుదలైన రాధే శ్యామ్ మోషన్ పోస్టర్, గతంలో విడుదల చేసింది కూడా కాపీయేనట. మీరూ ఓ లుక్ వెసెయ్యండి.



