ఎక్సక్లూసివ్ : బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా అవినాష్

ABE6DF46 E268 409C 8F5E D637B31BC158
ABE6DF46 E268 409C 8F5E D637B31BC158

| రియాలిటీ షో బిగ్ బాస్ కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది .. ఆదరణ తో పాటు బిగ్ బాస్ పై సెటైర్లు , ట్రోల్ల్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎలిమినేషన్ గురించి జనాల్లో చర్చ గట్టిగానే జరుగుతుంది . ఎలిమినేషన్ నుంచి మెహబూబ్ ని బిగ్ బాస్ టీం కావాలనే రక్షిస్తున్నారు అనే ఆరోపణ ,ఇందులో భాగంగానే దేవి ని , స్వాతి ని ఎలిమినేట్ చేసారు అని బిగ్ బాస్ పై మండిపడుతున్నారు నెటిజన్లు .

ఇప్పటీకే ఏడవ వారంకి చేరుకున్న బిగ్ బాస్ షో , దసరా ని పురస్కరించుకుని ఒక స్పెషల్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ని ఏర్పాటు చేసిన విషయం విదితమే .. ఈ టాస్క్ లో ముక్కు అవినాష్ , అరియనా ఇద్దరు బెస్ట్ పెరఫార్మర్లు గా నిలిచారు ..

అనుకున్నట్టు గానే ఈ ఇద్దరి మధ్యే కెప్టెన్సీ టాస్క్ జరిగింది, ఈ విషయం ప్రోమో లో తెలిసిపోయింది అనుకోండి .. మన సినిమా కు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ కెప్టెన్సీ టాస్క్ లో మెరుగైన ఆట తీరుని కనబరిచి అరియనా ను పూర్తి గా డామినేట్ చేసి కెప్టెన్ అయ్యాడు అవినాష్ .

ఈ కెప్టెన్సీ తో వచ్చే వారం ఇమ్మ్యూనిటి అవినాష్ కు లభిస్తుంది అంటే ఎనిమిదవ వారం ఎలిమినేషన్ నుండి సేవ్ అవుతాడు అన్నమాట ..