మూడు నెలల్లో ఫినిష్ చెయ్యాల్సిందే .. డైరెక్టర్ కు చిరు కండిషన్

మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి

మూడు నెలల్లో ఫినిష్ చెయ్యాల్సిందే .. డైరెక్టర్ కు చిరు కండిషన్ | ‘ఆచార్య’ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి ‘వేదాళం’ , ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే లూసిఫెర్ పవన్ చేయనున్నాడనే వార్తలూ వస్తున్నాయి. ఈ సినిమాపై ఇంతవరకు క్లారిటీ లేదు. అయితే ‘ఆచార్య’ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లబోయేది మాత్రం ‘వేదాళం’ తెలుగు రీమేక్ అని తెలుస్తోంది. డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ రీమేక్ కి దర్శకత్వం వహించ నున్నాడని తెలుస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెహర్ రమేష్ కి మెగాస్టార్ 3 నెలలో సినిమా కంప్లీట్ చేయాలని కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. ‘వేదాళం’ తెలుగు రీమేక్ ని ‘ఆచార్య’ షూటింగ్ పూర్తయిన వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారట. వచ్చే సంవత్సరం దసరాకి ఈ సినిమాని విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారట.థియేటర్స్ త్వరలో ఓపెన్ చేయనుండటం, తో ఆచార్య ఓటిటి విడుదల లేనట్లే.