ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అంటే ఇదేనేమో

ఆచార్య
ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి తో కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా ప్రకటించినప్పటి నుంచి, ఆ ప్రాజెక్ట్ ను కష్టాలు చుట్టుముడుతున్నాయి. మొదట్లో త్రిషను హీరోయిన్ గా ఫిక్స్ చేసారు. అనుకోని విధంగా కొరటాలకు షాక్ ఇస్తూ త్రిష ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ తరువాత భారీ రెమ్యూనరేషన్ తో కాజల్ ను తీసుకొచ్చారు. ఆ వెంటనే కరోనా కష్టాలతో షూటింగ్ లన్నీ ఆగిపోయాయి.

తాజాగా ఈనెల 30 న కాజల్ వివాహం చేసుకుంటున్నట్టు స్వయంగా ప్రకటించింది. అంటే దాదాపుగా మరో మూడునెలల వరకు షూటింగ్ కు అవకాశం ఉండక పోవచ్చు. దీంతో ఆచార్య మొదలుపెట్టటానికే చాలా టైం పడుతుందన్నమాట. మరి వెయిట్ చెయ్యాలా, లేక కాజల్ ను మార్చాలా అనే ఆలోచనలో వున్నాడు కొరటాల..ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అంటే ఇదేనేమో..