కుమారి కాస్తా ఆంటీ అయిందిగా

కుమారి కాస్తా ఆంటీ అయిందిగా
కుమారి కాస్తా ఆంటీ అయిందిగా

ఒకప్పుడు కుమారి 21F అంటూ యువతలో గిలిగింతలు సృష్టించింది హెబ్బా పటేల్. ఆపాత్ర హెబ్బా ను ఒక సెక్స్ బాంబు తరహాలో ఎలివేట్ చేసింది. దీంతో ఆ తరువత వచ్చిన రోల్స్ కూడా అలాంటివే కావటంతో, అన్ని ప్లాపులయ్యి హెబ్బా బాగా వెనక పడిపోయింది. నితిన్ భీష్మ లో కాల్ గర్ల్ గా నటించిన హెబ్బాను చూసి అమ్మడి పనైపోయింది అనుకున్నారు అందరు. దాదాపు అలాంటి పరిస్థితే ఉంది లెండి. త్వరలో ఒటిటి లో విడుదలకు సిద్ధంగానున్న రాజ్ తరుణ్ సినిమా తప్ప అమ్మడి చేతిలో మరే సినిమా లేదు. రాజ్ తరుణ్ కి అసలు క్రేజ్ లేకపోవటం, హెబ్బా క్రేజ్ కూడా పడిపోవటం కొంత ఆందోళన కలిగించే అంశమే.

తాజాగా ఇంతకుముందు ఎప్పుడూ చేయని కొత్త తరహా రోల్ లో నటించనుంది హెబ్బా పటేల్. హెబ్బాపటేల్ నటిస్తున్న ఈ చిత్రానికి ఓదెల రైల్వే స్టేషన్ అనే పేరు ఖరారు చేసారు. సంపత్ నంది అందించిన కథతో అశోక్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించనున్నాడు. ఈ సినిమానుంచి హెబ్బా లుక్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణ పల్లెటూరి గెటప్ లో నిండు చీరలో హెబ్బా కొత్తగా కనిపిస్తుంది. ఈ సినిమాతోనైనా హెబ్బా మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశిద్దాం.