మహేష్ సర్కారు వారి పాటలో విద్యాబాలన్

మహేష్ సర్కారు వారి పాటలో విద్యాబాలన్
మహేష్ సర్కారు వారి పాటలో విద్యాబాలన్

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్న చిత్రం ‘సర్కారు వారి పాట. ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణం గా ఆలస్యమైంది. ఈ సినిమాలో హీరో మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ మరియు నిర్మాతలు మాత్రమే నిజం. మిగతావన్నీ ఊహాగానాలే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. త్వరలోనే అమెరికాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రీకరణతో షూటింగ్ మొదలుకానుంది. అయితే ఈ సినిమాపై రోజుకో ర్యూమర్ నెట్లో షికారు చేస్తుంది.

ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది అధికారికం గా ప్రకటించకపోయినా, సోషల్ మీడియా చాలామంది విలన్లను ప్రకటించేసింది. ముఖ్యం గ అనిల్ కపూర్, అరవింద స్వామి, ఉపేంద్ర, సుదీప్ ఈలిస్టులో ఉన్నారు. తాజాగా మహేష్ అక్కగా విద్యాబాలన్ నటించబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది.