ఇస్మార్ట్ యావరేజే .. అందుకేనా డబుల్ ఇస్మార్ట్ ??

300
Puri jagannadh Double Ismart | ఇస్మార్ట్ యావరేజే .. అందుకేనా డబుల్ ఇస్మార్ట్ ??
Puri jagannadh Double Ismart | ఇస్మార్ట్ యావరేజే .. అందుకేనా డబుల్ ఇస్మార్ట్ ??

Puri jagannadh Double Ismart | ఇస్మార్ట్ యావరేజే .. అందుకేనా డబుల్ ఇస్మార్ట్ ?? …. పూరి జగన్నాథ్ తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో హీరో రామ్ నభా నటేష్, నిధి అగర్వాల్ లతో చేసాడు. ఇద్దరు హీరోయిన్లు కూడా గ్లామర్ ఏ మాత్రం దాచుకోకుండా ప్రదర్శించారు. అయితే సినిమాకు మాత్రం యావరేజ్ టాక్ వచ్చింది. వచ్చే సోమవారానికి ఈ సినిమా పరిస్థితి ఏంటి అనేది పూర్తిగా తెలిసిపోతుంది. నిజానికి ప్లాప్ హీరో, ప్లాప్ డైరెక్టర్ కావటంతో ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు తక్కువే. టీజర్ ట్రైలర్ ఇచ్చిన హాప్ తో గత చిత్రాలకంటే కొంత మెరుగ్గానే ఓపెనింగ్స్ వచ్చాయి. నిన్న సాయంత్రానికి కొంత ఆశాజనకంగా 80 శాతం ఆక్యుపెన్సీ తో సినిమా పుంజుకుంది. ఇదే కనుక ఈరోజు కూడా కాంటీనుఈ అయితే సినిమా హిట్ జాబితాలో చేరిపోతుంది.

ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా “డబుల్ ఇస్మార్ట్” అనే టైటిల్ అనౌన్స్ చేసాడు పూరి. ఇతర వివరాలు త్వరలోనే తెలియచేస్తారట. వైజాగ్ లాంటి కొన్ని చోట్ల ఇస్మార్ట్ శంకర్ కు పాలాభిషేకాలు కూడా చేసారంటే, మాస్ ఆడియన్స్ లో పూరి కి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. ఇస్మార్ట్ పూర్తిగా మాస్ ఆడియన్స్ టార్గెట్ కాబట్టి ఖచ్చితంగా హిట్ కొడతాడు అనే సినిమా పండితుల అభిప్రాయం. అయితే అన్ని రివ్యూ లు మాత్రం సినిమాకు యావరేజ్ మార్కులే ఇచ్చాయి.

Loading...