మహిళా సంఘాలే పైడ్ పబ్లిసిటీ ఇచ్చాయట

1992
Amala paul Aadai movie publicity | మహిళా సంఘాలే పైడ్ పబ్లిసిటీ ఇచ్చాయట
Amala paul Aadai movie publicity | మహిళా సంఘాలే పైడ్ పబ్లిసిటీ ఇచ్చాయట

Amala paul Aadai movie publicity | మహిళా సంఘాలే పైడ్ పబ్లిసిటీ ఇచ్చాయట … అమల పాల్ ఆడై (తెలుగులో ఆమె) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. సెన్సార్ బోర్డు ఇప్పటికే సినిమాకు ఏ సర్టిఫికెట్ కేటాయించింది. టీజర్ ట్రైలర్ లలో అమలాపాల్ న్యూడ్ గా కనిపించి సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ ఇచ్చింది. అదే న్యూడిటీ పై మహిళా సంఘాలు రచ్చ చేస్తున్నాయి. తాజాగా రాజేశ్వరి ప్రియా అనే మహిళా ఎమ్మెల్యే మరో పోలీస్ కంపాయింట్ రిజిస్టర్ చేసింది. రాష్ట్రంలో సినిమా న్యూడ్ పోస్టర్లు తొలగించాలని, న్యూడిటీ ని ప్రోత్సహిస్తున్న నిర్మాతలను అరెస్ట్ చేయాలంటూ కేసు నమోదు చేసింది.

సినిమా విడుదలకు కొన్ని గంటలు ముందు ఈ కేసు నమోదు కావటం, అలాగే మహిళా సంఘాల ఆందోళనలు సినిమాకు ఎనలేని ప్రచారాన్ని తీసుకొచ్చాయి. ఈవిషయం పై స్పందించిన ఒక పీఆర్వో (పేరు చెప్పటం ఇష్టంలేని) “ఇలాంటివి అన్ని సహజమేనని, కాకపోతే అందరు అనుకుంటున్నట్టు ఇది ఫ్రీ పబ్లిసిటీ కాదని, కుల సంఘాలు, మహిళా సంఘాలకు డబ్బులు చెల్లించి మరీ ఇలాంటి కాంట్రవర్సీలు నిర్మాతలే క్రియేట్ చేస్తారని” చెపుతుంది. ఈరోజు విడుదలవుతున్న ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ ఎక్ష్పెక్త్ చేస్తున్నారు సినిమా పండితులు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా భవిష్యత్తు తేలిపోనుంది.

Loading...