రోజుకి 15 లక్షలిస్తే రెడీ

347
రోజుకి 15 లక్షలిస్తే రెడీ
రోజుకి 15 లక్షలిస్తే రెడీ

రోజుకి 15 లక్షలిస్తే రెడీ ….. వెనకాల పెద్ద కమర్షియల్ హిట్లేమీ లేకున్నా, ప్రస్తుతం టాలీవుడ్ లో బాలీవుడ్ లో బిజీగా మారింది డస్కీ బ్యూటీ పూజాహెగ్డే. రెండేళ్ల క్రితం హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన దువ్వాడ జగన్నాధం సినిమాలో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసింది పూజాహెగ్డే. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా, అమ్మడి అందాల ఆరబోత మరికొన్ని సినిమాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం హరీష్ శంకర్ అదే మెగా కాంపౌండ్ లో వాల్మీకి అనే సినిమా కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాకు ఎలాగైతేనేమి పూజాహెగ్డే ను నటింపచేసేందుకు ఒప్పించాడు హరీష్ శంకర్.

సినిమా ఐతే ఓకే చేసింది కానీ, రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గేది లేదు అంటుందట. ఒక పాట, కొన్ని సీన్ల కోసం పది రోజుల కాల్షీట్ కి కోటిన్నర డిమాండ్ చేసిందట (ఖర్చులు, స్టాఫ్ రెమ్యునరేషన్ తో కలిపి). అయితే పూజాహెగ్డే కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ మొత్తాన్ని చెల్లించి పూజ ను ఫిక్స్ చేశారట. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కానుంది.

Loading...