అరె హౌలే … ఏం జేస్తున్నవ్ బె బీచ్ ల ??

1315
Ismart Shankar movie trailer 2 | అరె హౌలే…. ఏం జేస్తున్నవ్ బె బీచ్ ల ??
Ismart Shankar movie trailer 2 | అరె హౌలే…. ఏం జేస్తున్నవ్ బె బీచ్ ల ??

Ismart Shankar movie trailer 2 | అరె హౌలే…. ఏం జేస్తున్నవ్ బె బీచ్ ల ?? … పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఇప్పటికే పాటలు, టీజర్, ట్రైలర్ విడుదలయ్యాయి. అన్ని కూడా అంచనాలు పెంచటంతో పాటు కావాల్సినంత కాంట్రవర్సీ తో పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. రీసెంట్ గా విడుదల చేసిన మొదటి ట్రైలర్ మొత్తం యాక్షన్ ప్యాక్డ్ గా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. కొద్దిసేపటి క్రితం ఈ సినిమా రెండో ట్రైలర్ ని విడుదల చేసారు. తాజాగా హిందీ లో విడుదలై భారీ విజయం సాధించిన కబీర్ సింగ్ సినిమాలో లవర్ ని చెంప దెబ్బ కొట్టటం పై సందీప్ రెడ్డి వంగ కామెంట్లు, ఆ తరువాత చిన్మయి, సమంత లాంటి వాళ్ళు దానికి కౌంటర్ ఇవ్వటం తెలిసిందే. ప్రస్తుతక్మ్ దేశం మొత్తం చర్చ జరుగుతున్నా ఈ సున్నితమైన అంశాన్ని ఇస్మార్ట్ శంకర్ లో పూరి జగన్నాథ్ రివర్స్ లో చూపించి మరోసారి ఫ్రీ పబ్లిసిటీ ప్లాన్ చేసాడు. వివరాల్లోకి వెళితే …

రెండో ట్రైలర్ లో పూరి పూర్తిగా బోల్డ్ టాక్, లాప్ లవ్ పైనే దృష్టి సారించినట్టు తెలుస్తుంది. నభా నటేష్ “అరె హౌలే.. ఏం జేస్తున్నవ్ బె బీచ్ ల” అని రామ్ ని అడగటం, వెంటనే రామ్ “చేపకు బొక్కవెట్టి అందుల పుల్లవెట్టి కింద మంట బెట్టిన” అనగానే లాగిపెట్టి చెంపపై ఒక్కటిస్తుంది. ప్రస్తుతం బర్నింగ్ పాయింట్ అయిన లాప్ లవ్ అంశాన్ని టచ్ చేయటంతో బహుశా ఇది వైరల్ ఆయె అవకాశం ఉంటుందని పూరి భావించి ఉండచ్చు. “షాది కే బాద్.. రోజుకొక్కసారైనా కొట్టాల్రా దీన్ని” అనే విఒలెంత్ డైలాగులు, “ఈమధ్య పెళ్ళికి ముందు హనీమూన్లు ఐతున్నయే.. తర్వాత పెళ్లి అయితే ఐతది లేకుంటే లేదంట. జమానా అట్లుంది మల్ల .. ఏం జేస్తం ఫాలో ఐతం” అనే సెటైరిక్ డైలాగ్స్ తో రెండో ట్రైలర్ సినిమాపై అంచనాలు ఆకాశానికి ఎత్తేలా ఉన్నాయి. ఈనెల 18 న ఇస్మార్ట్ శంకర్ విడుదల కానుంది. ఆ రెండో ట్రైలర్ పై మీరూ ఓ లుక్ వేయండి.

Puri jagannadh, Ismart shankar, Ram, Nabha natesh, Nidhhi agerwal, Nidhi agarwal

Our facebook page ….. english site

Loading...