కంగనా పై బాన్ ఎత్తేసే అవకాశమే లేదన్న మీడియా

140
కంగనా బలుపుకు పరాకాష్ట.. బాన్ ఎత్తేసే అవకాశమే లేదన్న మీడియా
కంగనా బలుపుకు పరాకాష్ట.. బాన్ ఎత్తేసే అవకాశమే లేదన్న మీడియా

కంగనా పై బాన్ ఎత్తేసే అవకాశమే లేదన్న మీడియా …. కంగనా రనౌత్ మరియు ఆమె చెల్లెలు రంగోలి వల్గర్ బిహేవియర్ కు విరుద్ధం గా మీడియా జర్నలిస్టులు కంగనా ను బాన్ చేసిన విషయం విదితమే.కంగనా తాజా చిత్రం జడ్జ్మెంటల్ హై క్యా ఈనెల 25 న విడుదలవుతుంది. కంగనా బిహేవియర్ కారణంగా జర్నలిస్టులు ఆమెతో పాటు సినిమాను కూడా బాన్ చేసారు. ఈవిషయంపై నిర్మాత ఏక్తా కపూర్, హీరో రాజ్ కుమార్ రావు ఇప్పటికే క్షమాపణలు చెపుతూ వీడియోలు విడుదల చేసారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఈ వీడియోలపై సంతృప్తి కనపరుస్తూనే, కంగనాపై బాన్ మాత్రం కొనసాగుతుంది అని ప్రకటించింది. పైగా కంగనా చెల్లెలు మరోసారి “కంగనా క్షమాపణలు చెప్పదు” అని ట్వీట్ చేయటంతో, పుండు మీద కారం చల్లినట్టయింది. ఇప్పటి వరకు కంగనా లాంటి వాళ్లకు సపోర్ట్ గా నిలిచిన మీడియాకు గడ్డి పెట్టినట్టయింది అనే గుసగుసలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. కంగనా రనౌత్ తాజా చిత్రం జడ్జిమెంటల్ హై క్యా సాంగ్ లాంచ్ సమయంలో కంగనా ఒక జర్నలిస్ట్ తో అగ్లీ ఆర్గుమెంట్ చేసిన విషయం తెలిసే ఉంటుంది. ఒకవేళ ఆ విషయం ఫాలో అయి ఉండకపోతే ఈ వీడియో చుడండి.

Loading...