అస్సలు క్రేజ్ లేని డిజాస్టర్ హీరో ఒకేసారి 4 ప్రాజెక్టులా?? కారణమదేనా??

458
అస్సలు క్రేజ్ లేని డిజాస్టర్ హీరో ఒకేసారి 4 ప్రాజెక్టులా?? కారణమదేనా??
అస్సలు క్రేజ్ లేని డిజాస్టర్ హీరో ఒకేసారి 4 ప్రాజెక్టులా?? కారణమదేనా??

అస్సలు క్రేజ్ లేని డిజాస్టర్ హీరో ఒకేసారి 4 ప్రాజెక్టులా?? కారణమదేనా?? … మంచు మోహన్ బాబు విలన్ గా ఎంటర్ అయి టాలీవుడ్ లో హీరోగా, విలక్షణ నటుడిగా ఎదిగాడు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడి తరువాత అంత క్రమ శిక్షణ కలిగిన నటుడిగా మోహన్ బాబు కు మంచి పేరే ఉంది. ఈతరం మంచు హీరోలు మాత్రం క్రమ శిక్షణ విషయంలో పూర్తి విరుద్ధమని వారితో సినిమా చేసిన ఏ నిర్మాత అయినా, దర్శకుడు అయినా ఇప్పటికే గ్రహించి వుంటారు. పైగా ఇప్పటి వరకు ఒక్క భారీ హిట్ కూడా సాధించింది లేదు. మంచు విష్ణు ఎప్పుడో వచ్చిన ఢీ సినిమా తప్పితే మరో హిట్ కొట్టిన జాడలు లేవు. ఈమధ్యకాలంలో సినిమాలైతే భారీ డిజాస్టర్లు. తాజాగా విడుదలైన ఓటర్ అనే సినిమా ఎప్పుడొచ్చిందో ఎటుపోయిందో కూడా ఎవరికీ తెలియదు. పైగా ఈ సినిమా నిర్మాతను మంచు ఫామిలీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో టాలీవుడ్ లో అందరికి తెలుసు. తాజాగా మంచు విష్ణు ఒకే సరి నాలుగు సినిమాలు మొదలు పెట్టినట్టు ట్వీట్ చేసాడు. ఎక్కడో మిగిలిన కొంత మంది మంచు ఫాన్స్ కంగ్రాట్స్ చెపితే, చాలా మంది మాత్రం రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ సీఎం కావటంతో ఈ ఐదేళ్లు ఎన్ని వేషాలైనా వేస్తారు అనే అర్ధం తోనే ఎక్కువ ట్రోల్ల్స్ చేస్తున్నారు (వైసిపి డబ్బులు పెడుతోంది అని వీరి అభిప్రాయం). ఆ ట్వీట్ పై మీరూ ఓ లుక్ వేయండి.

Loading...