ముగ్గురు బోల్డ్ భామలతో రొమాన్స్ చేయనున్న డిస్కోరాజా

181
Ravi teja Disco raja Update | ముగ్గురు బోల్డ్ భామలతో రొమాన్స్ చేయనున్న డిస్కోరాజా
Ravi teja Disco raja Update | ముగ్గురు బోల్డ్ భామలతో రొమాన్స్ చేయనున్న డిస్కోరాజా

Ravi teja Disco raja Update | ముగ్గురు బోల్డ్ భామలతో రొమాన్స్ చేయనున్న డిస్కోరాజా ….. రవితేజ వరుస డిజాస్టర్లతో డీలా పడిపోయాడు. తదుపరి ప్రాజెక్ట్ కోసం కొంత జాగ్రత్త తీసుకోవటం వల్లనే ఇంత గ్యాప్ వచ్చింది. ఈమధ్య కాలంలో డిస్కో రాజా బడ్జెట్ కట్ చేసారని, అసలు సినిమానే ఆగిపోయిందని చాల ర్యూమర్లు ఫిలిం నగర్ లో చక్కర్లు కొట్టాయి. విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమా మొత్తానికి షూటింగ్ మొదలైంది. ఇప్పటికే నభా నటేష్, పాయల్ రాజపుత్ హీరోయిన్లుగా అనౌన్స్ కూడా చేసారు. తాజాగా డిస్కోరాజా కోసం తాన్యా హాప్ ను కూడా మరో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు వార్తలందుతున్నాయి. ఈసినిమాతో అయినా హిట్ కొట్టకపోతే, రవితేజ మార్కెట్ పూర్తిగా డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. చిన్న చిన్న సినిమాలలో మాత్రమే నటించిన తాన్యా హాప్ కు రవితేజ డిస్కో రాజా ఒక మంచి అవకాశమని చెప్పాలి. ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు, తాన్యా హాప్ కు ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండనుంది.

Loading...