మొత్తానికి గుమ్మడికాయ కొట్టేసారు

1782
Nagarjuna Manmadhudu 2 Update | మొత్తానికి గుమ్మడికాయ కొట్టేసారు
Nagarjuna Manmadhudu 2 Update | మొత్తానికి గుమ్మడికాయ కొట్టేసారు

Nagarjuna Manmadhudu 2 Update | మొత్తానికి గుమ్మడికాయ కొట్టేసారు …. నాగార్జున ఒకప్పటి మన్మధుడు కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ తో, బ్రహ్మానందం అద్భుత నటనతో భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా మన్మధుడు 2 షూటింగ్ పూర్తి చేసుకుని, వచ్చే నెలలో విడుదలకు సిద్ధమైంది. ఒక్క నాగార్జున, మన్మధుడు సీక్వెల్ అన్న విషయం పక్కనపెడితే సినిమాలో అంతగా అంచనాలు పెంచే అంశాలేవీ లేవు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పై కూడా పెద్దగా ఎవరికీ అంచనాలు లేవు. నాగార్జున కు మాత్రం ఈసినిమాపై భారీ గా కాన్ఫిడెన్స్ ఉన్నట్టు కనపడుతుంది. ఆగష్టు 15 న ప్రభాస్ సాహో విడుదలవుతున్నా, మన్మధుడు 2 తగ్గటం లేదు. ఒక వారం ముందుగా థియేటర్స్ లోకి మన్మధుడు 2 వస్తుంది. మరోపక్క నాగార్జున తదుపరి సీక్వెల్ కోసం రెడీ అయిపోయాడు. సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజు వచ్చే సంక్రాంతి కి బరిలో నిలవనుంది.

Loading...