కూతురి వాంగ్మూలంతో బయటపడ్డ వనిత విజయ్ కుమార్

1974
కూతురి వాంగ్మూలంతో బయటపడ్డ వనిత విజయ్ కుమార్
కూతురి వాంగ్మూలంతో బయటపడ్డ వనిత విజయ్ కుమార్

కూతురి వాంగ్మూలంతో బయటపడ్డ వనిత విజయ్ కుమార్ …. విజయ్ కుమార్ మంజుల దంపతుల పెద్ద కుమార్తె వనిత దాదాపుగా దశాబ్దం నుంచి కూడా వివాదాల్లో నిలుస్తూ ఉంది… రీసెంట్ గా తండ్రి విజయ్ కుమార్ తో ఆస్తి విషయంలో గొడవ పడిన వనిత ప్రస్తుతం కిడ్నాప్ కేసులో చిక్కుకుంది. 2007 లో వివాహం చేసుకున్న వనిత భర్త ఆనంద్ రాజ్ కు 2012 లోనే విడాకులిచ్చింది. ఆరోజు నుంచి కూడా వీరిద్దరి మధ్య కూతురు ఎవరి దగ్గరుండాలనే విషయం పై గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ఆమె మాజీ భర్త తన కుమార్తెను కిడ్నప్ చేసింది అంటూ ఫిబ్రవరి లో హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

అప్పటినుంచి పెండింగ్ లో ఉన్న కేసు, వనిత బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వగానే కదిలింది. కమల హాసన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 లో వనిత కూడా ఒక కంటెస్టెంట్ కావటంతో తెలంగాణ పోలీసులు చెన్నై చేరుకొని నస్రత్ పోలీసుల సహకారం తో రెండు గంటలపాటు విచారణ చేపట్టారు. ఆరోజు సాయంత్రం తన కూతురుని హాజరు పరుస్తానని చెప్పిన వనిత సరిగ్గా మొన్న సాయంత్రం 5 గంటలకు కూతురుని పోలీసుల ఎదుట హాజరు పరిచింది. అయితే ఆమె తననెవరూ కిడ్నప్ చేయలేదని, తాను ఇష్టపడే తల్లి దగ్గర ఉంటున్నానని పోలీసులతో చెప్పటంతో కేసు కంచికి చేరింది.

Loading...