హీరోనే మైనస్ … అర్జున్ రెడ్డి మరోసారి చెత్తబుట్టలోకేనా ??

818
Dhruv vikram debut movie | హీరోనే మైనస్ … అర్జున్ రెడ్డి మరోసారి చెత్తబుట్టలోకేనా ??
Dhruv vikram debut movie | హీరోనే మైనస్ … అర్జున్ రెడ్డి మరోసారి చెత్తబుట్టలోకేనా ??

Dhruv vikram debut movie | హీరోనే మైనస్ … అర్జున్ రెడ్డి మరోసారి చెత్తబుట్టలోకేనా ?? ….. తెలుగులో భారీ హిట్ అయిన అర్జున్ రెడ్డి తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ సినిమా హిందీ వెర్షన్ కబీర్ సింగ్ విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమిళ వెర్షన్ మాత్రం మొదటి నుంచి సమస్యలతోనే వుంది. విక్రమ్ తన కుమారుడు ధృవ్ విక్రమ్ ను హీరోగా తెరంగేట్రం చేపిస్తున్న సినిమా ఇది. మొదట క్లాసిక్ దర్శకుడు బాల దర్శకత్వంలో ధృవ్ విక్రమ్, మేఘ చౌదరి ప్రధాన పాత్రలలో “వర్మ” అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ విడులా చేసిన తరువాత నెటిజన్లు సినిమాపై విపరీతం గా ట్రోల్ చేసారు. విక్రమ్ కూడా అవుట్ ఫుట్ నచ్చలేదంటూ సినిమా మొత్తాన్ని మరోసారి తెరకెక్కించాలని నిర్ణయం తీసుకుంటూ దర్శకుణ్ణి, హీరోయిన్ ని, మొత్తం టీమ్ నే మార్చేశాడు.

ఇక రెండో వెర్షన్ కోసం అర్జునరెడ్డి సహాయ దర్శకులలో ఒకరైన గిరీశయ్య ను దర్శకుడిగా పరిచయం చేస్తూ “ఆదిత్య వర్మ” పేరుతొ అదే సినిమా మరోసారి తెరకెక్కించారు. దాదాపుగా షూటింగ్ కూడా పూర్తయిన ఈ చిత్ర టీజర్ ను గతనెలలో విడుదల చేసారు. ఆ టీజర్ కు కూడా విపరీతంగా నెగటివ్ కామెంట్స్ రావటంతో మరోసారి విక్రమ్ ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. మొదటి నుంచి కూడా ఈ సినిమా కు ఆ హీరోనే మైనస్ అని అందరు చెపుతున్నా అర్ధం కానీ విక్రమ్, రెండు సార్లు డబ్బు దుబారా చేసిన తరువాత అదే అభిప్రాయానికి వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. స్నేహితులు కూడా ఈ సినిమాతో ధృవ్ ను పరిచయం చేస్తే నెగటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం వుంది అని సలహాలివ్వటంతో ఈసినిమా పూర్తిగా ల్యాబ్ కె పరిమితం చేసే ఆలోచనలో వున్నాడట విక్రమ్. ఇప్పటి వరకు పెట్టిన ఖర్చును నిర్మాతలకు ఇచ్చేసి, మరో సినిమాతో ధృవ్ ను డెబ్యూ చూపించే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినట్టు కోలీవుడ్ కోడై కూస్తోంది.

Our facebook page …. English website

Loading...