బిగ్ బాస్ 3 | చీటింగ్ కేసులో బుక్కయిన మరో కంటెస్టెంట్

981
Meera Mithun Bigg boss 3 | బిగ్ బాస్ 3 | చీటింగ్ కేసులో బుక్కయిన మరో కంటెస్టెంట్
Meera Mithun Bigg boss 3 | బిగ్ బాస్ 3 | చీటింగ్ కేసులో బుక్కయిన మరో కంటెస్టెంట్

Meera Mithun Bigg boss 3 | బిగ్ బాస్ 3 | చీటింగ్ కేసులో బుక్కయిన మరో కంటెస్టెంట్ ……. బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు వెర్షన్ లేట్ అయినా తమిళ బిగ్ బాస్ 3 ఇప్పటికే మొదలైంది. కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న ఈ ఈవెంట్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో మొన్న విజయ్ కుమార్ కుమార్తె పై కేసు నమోదు కాగా తాజాగా మరో కంటెస్టెంట్ పై చీటింగ్ కేసు నమోదయింది. మాజీ మిస్ సౌత్ ఇండియా అయిన మీరా మిథున్ తమిళనాడులో కూడా అందాల పోటీల నిర్వహణకు ప్రయత్నాలు చేసింది. అవి బెడిసి కొట్టటమే కాకుండా, అమ్మడికి బెందిరింపులు సైతం వచ్చాయి.

అందాల పోటీలు మన సంప్రదాయం కాదు అంటూ గతంలో కూడా చాల చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. అదే ఇక్కడా రిపీట్ అయింది. ఈమె నిర్వహించే అందాల పోటీలకు డిజైనింగ్ కాంట్రాక్టు ఇస్తానని చెప్పి రజిత్ భద్రాశ్రీ అనే పూల వ్యాపారి వద్ద 50000 అడ్వాన్స్ గా తీసుకుందట. కాంట్రాక్టు ఇవ్వక, ఇచ్చిన డబ్బు తిరిగివ్వక మోసం చేసింది అంటూ రజిత్ భద్రాశ్రీ పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మీరా మిథున్ ను ప్రశ్నించేందుకు హౌస్ లో అడుగుపెట్టే విషయంలో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.

Loading...