వరంగల్ కాలేజీలో పోరగాళ్లను ఉచ్చ పోయించిందట … పూరి మార్క్ ట్రైలర్ అదుర్స్

1645
Ismart Shankar movie trailer review | వరంగల్ కాలేజీలో పోరగాళ్లను ఉచ్చ పోయించిందట … పూరి మార్క్ ట్రైలర్ అదుర్స్
Ismart Shankar movie trailer review | వరంగల్ కాలేజీలో పోరగాళ్లను ఉచ్చ పోయించిందట … పూరి మార్క్ ట్రైలర్ అదుర్స్

Ismart Shankar movie trailer review | వరంగల్ కాలేజీలో పోరగాళ్లను ఉచ్చ పోయించిందట … పూరి మార్క్ ట్రైలర్ అదుర్స్ ….. పూరి జగన్నాధ్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. సొంత కుమారుడి సినిమాతో కూడా హిట్ కొట్టలేకపోయిన పూరి జగన్నాధ్ కు తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హీరోలను ఎలివేట్ చేయాలంటే ఇప్పటికీ పూరి తరువాతే ఎవరైనా. ఎంతో మంది స్టార్ కిడ్స్ ని తెరకు పరిచయం చేసిన పూరి జగన్నాథే బాలయ్య వారసుడి సినిమా రేస్ లో ఉన్న దర్శకులలో మొదటి ప్లేస్ లో ఉన్నాడంటే ఆ హీరోని ఎలివేట్ చేసే విధానమే కారణం. పూరిలో ఉన్న ఈ ప్లస్ పాయింటే చాలా సార్లు భారీ మైనస్ పాయింట్ కూడా అవుతుంది. పైసా వసూల్ లో బాలయ్య చెప్పినట్టు “ఔటర్స్ నాట్ ఎలోడ్” అనే రీతిలో ఉంటున్నాయి ఈమధ్యకాలంలో పూరి సినిమాలు. మరీ ఓవర్ గా సదరు హీరోను ఎలివేట్ చేయటం ఇతర హీరోల ఫాన్స్ కు పూరి సినిమాలను దూరం చేస్తోంది. ఇక హీరో విషయానికి వస్తే రామ్ పోతినేని హిట్ కొట్టి చాలా ఏళ్ళే అయింది. మూడేళ్ళ క్రితం వచ్చిన నేను శైలజ ఒక మోస్తరుగా ఆడింది. మిగిలిన సినిమాలన్నీ కూడా భారీ డిజాస్టర్లే. పూరి రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఇద్దరికీ కూడా హిట్ కావటం అత్యవసరం.

ఈ సినిమాలో కన్నడ భామ నభా నటేష్, ముంబై భామ నిధి అగర్వాల్ లు రామ్ తో రొమాన్స్ చేయనున్నారు. మొదట విడుదల చేసిన లుక్స్, టీజర్ లో పూరి నిధి అగర్వాల్ గ్లామర్ పై ఫోకస్ పెడితే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో నభా నటేష్ బోల్డ్ నెస్ పైనే దృష్టి పెట్టాడు. నభా నటేష్ గత చిత్రంలో చేసిన రోల్ కు, ఇస్మార్ట్ శంకర్ కు పెద్ద తేడా ఏమి కనిపించటంలేదు. నిధి అగర్వాల్ విషయంలో మాత్రం కంప్లీట్ యు-టర్న్ అని చెప్పచు. ఏ మాత్రం హాట్ నెస్ లేని గ్లామర్తో అక్కినేని హీరోల సరసన కనిపించిన నిధి ఇప్పుడు ది మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ గా తనను తాను మార్చేసుకుంది. బహుశా పూరి చేతిలో పడ్డ ఏ హీరోయిన్ అయినా హాట్ గానే కనిపిస్తుందేమో. మొదటి లుక్ నుంచి బాగానే ఉన్న అంచనాలు, బీచ్ సాంగ్ తో అమాంతం పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్ అంచనాల్ని ఆకాశానికెత్తేశాయి. పూర్తి మాస్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన చిత్రమనేది ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ట్రైలర్ లో బోల్డ్ డైలాగ్స్, పూరి ఈజ్ బ్యాక్ అనేలా వున్నాయి. ట్రైలర్ పై మీరూ ఓ లుక్ వేయండి.

Ismart Shankar movie trailer review | వరంగల్ కాలేజీలో పోరగాళ్లను ఉచ్చ పోయించిందట … పూరి మార్క్ ట్రైలర్ అదుర్స్, Ismart Shankar, Ismart Shankar trailer

Our facebook Page ………….. English Site

Loading...