పెళ్లి కాకుండానే తల్లయ్యా తప్పేముందంటున్న రామ్ చరణ్ హీరోయిన్

246
పెళ్లి కాకుండానే తల్లయ్యా తప్పేముందంటున్న రామ్ చరణ్ హీరోయిన్
పెళ్లి కాకుండానే తల్లయ్యా తప్పేముందంటున్న రామ్ చరణ్ హీరోయిన్

పెళ్లి కాకుండానే తల్లయ్యా తప్పేముందంటున్న రామ్ చరణ్ హీరోయిన్ ….. పంజాబీ భామ మహి గిల్ హిందీ పంజాబీ సినిమాల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. 2003 లో హవాయే అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసినా, 2008 లో విడుదలైన దేవ్ డి సినిమా ఈమెకు అవార్డు తో పాటు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఏక్తా కపూర్ ఆల్ట్ బాలాజీ వెబ్ సిరీస్ అపహరన్ లో అమ్మడు ఒక రేంజ్ లో అందాలు ఆరబోసింది. గతేడాది మూడు సినిమాల్లో నటించిన మహి గిల్ కు ఇప్పుడు కూడా నాలుగు సినిమాలు చేతిలో వున్నాయి. రామ్ చరణ్ తుఫాన్ సినిమాలో మోనా డార్లింగ్ గా నటించిన ఈ అమ్మడు తాజాగా ఒక మీడియా ఇంటరాక్షన్ లో షాకిచ్చింది.

చాలా కాలం క్రితమే ఈమెకు 17 ఏళ్లకే పెళ్లయింది అనే ర్యూమర్ ఉండేది. ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది కదా అని ఆర్యూమర్ పై మొదట్లో అమ్మడు క్లారిటీ ఇవ్వలేదు. అందరు ఆ విషయం మరిచిపోయాక అవన్నీ ర్యూమర్స్ అని క్లారిటీ ఇచ్చి మరికొన్ని రోజులు ఫ్రీ పబ్లిసిటీ పొందింది. తాజా ఇంటర్వ్యూ లో తనకు ఇంకా పెళ్లి కాలేదని, మూడేళ్ళ కూతురుందని, ఆ పాపే తనకు సర్వస్వమని, పెళ్లి కాకుండా తల్లయితే తప్పేముందని ప్రశ్నిస్తోంది.

Loading...