పూరి కూడా సైలెంట్ గా లేపేసాడట

1675
Ismart shankar movie story review | పూరి కూడా సైలెంట్ గా లేపేసాడట
Ismart shankar movie story review | పూరి కూడా సైలెంట్ గా లేపేసాడట

Ismart shankar movie story review | పూరి కూడా సైలెంట్ గా లేపేసాడట …. డిజాస్టర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, డిజాస్టర్ హీరో రామ్, డిజాస్టర్ హీరోయిన్లు నభా నటేష్, నిధి అగర్వాల్ అందరు కలిసి ఇస్మార్ట్ శంకర్ కోసం జతకట్టారు. దాదాపు ఈ సినిమాతో సంబంధం ఉన్నవారంతా కూడా, ఈ సినిమా హిట్ అయితేనే కెరీర్ కొనసాగించే పరిస్థితి వుంది. ఇక ఇప్పటి వరకు విడుదల చేసిన లుక్స్, సాంగ్స్ అన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చింది. చాల వరకు సూపర్ అంటున్నా, కొంత మంది తెలంగాణ యాస నాచ్యురల్ గా లేదు అంటున్నారు. ఇక తాజగా మరో ర్యూమర్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇది పూరి ఒరిజినల్ కథ కాదని, మూడేళ్ళ క్రితం వచ్చిన హాలీవుడ్ సినిమా “క్రిమినల్” నుంచి కాపీ కొట్టాడని సోషల్ మీడియాలో కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. మరి కథ మొత్తం కాపీ కొట్టాడా, లేక తలలో చిప్ పెట్టటం అనే పాయింట్ ఆధారంగా కథ అల్లాడా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఆ రెండు ట్రైలర్స్ చుడండి…మీకే అర్ధమవుతుంది.

Loading...