బోగస్ పత్రాల కేసులో హీరో శివాజీ అరెస్ట్

85
బోగస్ పత్రాల కేసులో హీరో శివాజీ అరెస్ట్
బోగస్ పత్రాల కేసులో హీరో శివాజీ అరెస్ట్

బోగస్ పత్రాల కేసులో హీరో శివాజీ అరెస్ట్ …….. టివి 9 వాటాల విషయంలో రచ్చ రోడ్డెక్కిన విషయం అందరికి తెలిసిందే. TV9 లో షేర్స్ కొన్నట్టు బోగస్ పత్రాలు సృష్టించాడు అనేది శివాజీ పై నమోదైన కేసు. ఈకేసు విషయంలో రవిప్రకాష్, శివాజీ లకు ఇంతకు ముందే కోర్ట్ నోటీసులు పంపింది. అప్పటికే అండర్ గ్రౌండ్ అయిన రవిప్రకాష్, శివాజిలు నోటీసులు అందుకోలేదు. ఆతరువాత రవిప్రకాష్ కోర్టులో హాజరయ్యాడు కానీ శివాజీ మాత్రం హాజరు కాకపోవటంతో లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.

ఈ ఉదయం అమెరికా వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన శివాజీ, ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించటం తో దొరికిపోయాడు. ప్రస్తుతం శివాజీని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈకేసు విషయంలో హైకోర్టు లో శివాజీ వేసిన క్యాష్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసిన విషయం తెలిసిందే.

Loading...