స్మార్ట్ గా ఫైన్ కట్టిన ఇస్మార్ట్ శంకర్

168
స్మార్ట్ గా ఫైన్ కట్టిన ఇస్మార్ట్ శంకర్
స్మార్ట్ గా ఫైన్ కట్టిన ఇస్మార్ట్ శంకర్ … Cigarette smoking is injurous to health

స్మార్ట్ గా ఫైన్ కట్టిన ఇస్మార్ట్ శంకర్ …… పూరీజగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా షూటింగ్ చార్మినార్ పరిసరాల్లో జరుగుతుంది. రామ్ పోతినేని, నభా నటేష్, నిధి అగర్వాల్ ముఖ్యపాత్రాలలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా వుంది. నిన్న చార్మినార్ లో షూటింగ్ జరుగుతున్నా సమయంలో, రామ్ సిగరెట్ తాగుతూ ఉండటం గమనించిన పోలీసులు చట్టం ప్రకారం 200 రూపాయిల ఫైన్ విధించారు. ఈ వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. వచ్చేనెల 18 విడుదల కాబోతున్న ఈసినిమాకు నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా హైప్ క్రియేట్ చేసింది. ప్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న హీరో దర్శకులిద్దరికి కూడా ఈసినిమా హిట్ కావటం అత్యవసరం.

Loading...