డబుల్ రేట్ పెట్టి ఫ్లాట్ కొన్న తమన్నా రిచ్ అని నిరూపించుకుంది

144
డబుల్ రేట్ పెట్టి ఫ్లాట్ కొన్న తమన్నా రిచ్ అని నిరూపించుకుంది
డబుల్ రేట్ పెట్టి ఫ్లాట్ కొన్న తమన్నా రిచ్ అని నిరూపించుకుంది

డబుల్ రేట్ పెట్టి ఫ్లాట్ కొన్న తమన్నా రిచ్ అని నిరూపించుకుంది … తమన్నా ప్రస్తుతం డిజాస్టర్ల పరంపర కొనసాగిస్తుంది. సంక్రాంతి కి విడుదలైన ఎఫ్ 2 విజయం సాధించినా, ఆ క్రెడిట్ ఈమెకు రాలేదు. ఆ తరువాత వచ్చిన తమిళ, హిందీ సినిమాలు పేరుకి తగ్గట్టే నిశ్శబ్దంగా వచ్చి వెళ్లిపోయాయి. ప్రస్తుతం మరో బాలీవుడ్ సినిమా సైన్ చేసిన తమన్నా, ముంబై లోని పాశ్ ఏరియాలో వున్న బే వ్యూ అనే అపార్ట్మెంట్ లో 16 కోట్ల ౬౦ లక్షలు చెల్లించి మరీ ఫ్లాట్ తీసుకుంది. రెండు కార్ల పార్కింగ్ కోసం కోటి, ఇంటీరియర్ డిజైన్ కోసం మరో రెండు కోట్లు వెరసి దాదాపుగా 20 కోట్లు ఫ్లాట్ కోసం ఖర్చు చేస్తుంది తమన్నా. గతంలో అలియా భట్ 13 కోట్ల ఇంటి గురించి బాలీవుడ్ ఒక వారం చర్చించుకుంది. మరి 8 కోట్ల ఇంటిని 17 కోట్లు పెట్టి కొన్న తమన్నా గురించి ఎన్ని రోజులు చర్చించుకుంటారో చూడాలి.

Loading...