కియారా అద్వానీ జాక్ పాట్

137
కియారా అద్వానీ జాక్ పాట్
కియారా అద్వానీ జాక్ పాట్

కియారా అద్వానీ జాక్ పాట్ ….. రెండేళ్ల నుంచి కియారా అద్వానీ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. అన్నిటికంటే ముఖ్య కారణం లస్ట్ స్టోరీస్ అయినా, మొదటి పెద్ద సినిమా మాత్రం మహేష్ బాబు భరత్ అనే నేను. ఆ తరువాత వినయ విధేయ రామ తో డిజాస్టర్ అందుకున్నా ఆమెకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో మరో భారీ హిట్ అందుకుని క్రేజీ హీరోయిన్ అయిపొయింది. తాజాగా ఒక మీడియా ఛానల్ లో మాట్లాడుతూ, తనకు మొదట బ్రేక్ ఇచ్చింది తెలుగు సినిమా అని, ఇప్పుడు బాలీవుడ్ లో మళ్ళీ బ్రేక్ ఇచ్చింది తెలుగు డైరెక్టర్ అని ప్రస్తావించి సౌత్ పై ఉన్న అభిమానాన్ని తెలియచేసింది. గతంలో రాధికా ఆప్టే, ఇలియానా, తాప్సి, రకుల్ ప్రీత్ సింగ్ లాంటివాళ్లు బాలీవుడ్ లో అవకాశాలు రాగానే సౌత్ ని చులకన చేసిన విషయం అందరికి తెలిసింది. ఈ విషయం లో కియారా అందరికంటే బెటర్ అనిపించుకుంది. ఇక కబీర్ సింగ్ విషయానికి వస్తే నాలుగు రోజుల్లో 88 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం రేపటికి 100 కోట్ల క్లబ్ లో చేరనుంది. హీరో, హీరోయిన్, డైరెక్టర్ అందరికి కూడా ఇది మొదటి 100 కోట్ల క్లబ్ సినిమా కావటం విశేషం. దీంతో కియారా కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టకటం ఖాయం. మరి బాలీవుడ్ లోనే సెటిల్ అవుతుందో, మళ్ళీ తెలుగులో నటిస్తుందో రాబోయే కాలమే నిర్ణయిస్తుంది.

Loading...