నాగార్జున మన్మధుడు 2 స్టోరీ ఇదేనా ??

652
Nagarjuna Manmadhudu 2 Preview | నాగార్జున మన్మధుడు 2 స్టోరీ ఇదేనా ?? Nagarjuna, Manmadhudu 2 Preview, నాగార్జున, మన్మధుడు 2, Rakul preet singh
Nagarjuna Manmadhudu 2 Preview | నాగార్జున మన్మధుడు 2 స్టోరీ ఇదేనా ?? Nagarjuna, Manmadhudu 2 Preview, నాగార్జున, మన్మధుడు 2, Rakul preet singh

Nagarjuna Manmadhudu 2 Preview | నాగార్జున మన్మధుడు 2 స్టోరీ ఇదేనా ?? ….. అక్కినేని నాగార్జున తన సూపర్ హిట్ మూవీస్ మన్మధుడు, సోగ్గాడే చిన్ని నాయన లకు సీక్వెల్స్ తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. వాటిలో ఇప్పటికే మన్మధుడు 2 పట్టాలెక్కేసింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సీక్వెల్ లో నాగార్జునతో రొమాన్స్ చేయనుంది. అక్షర గౌడతో పాటు మరికొంత మంది స్టార్ హీరోయిన్స్ కేమియో చేయనున్నారు. రీసెంట్ గా టీజర్ విడుదలయింది. ఈసినిమా ప్రీతీ మోయి త మెయిన్ అనే ఫ్రెంచ్ సినిమాకు కాపీ అంటూ ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టీజర్ చుస్తే అది నిజమే అనిపించక మానదు. మరి ఫ్రీమేక్ చేస్తున్నారో లేదా రైట్స్ కొని రీమేక్ చేస్తున్నారో సినిమా యూనిట్ కె తెలియాలి. ఇక కథ విషయానికి వస్తే.

ఏభయ్యేళ్ళ నాగార్జునకు పెళ్లి కాకపోవటంతో ఆ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు అక్క చెల్లెళ్ళు. ఇంట్లో పెళ్లి గోల ఎక్కువైపోవటం తో నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ లో ఒక డీల్ కుదుర్చుకుంటాడు. ఆమె తనను లవ్ చేసినట్లు నటించాలని, ఆ తరువాత తన కుటుంబ సభ్యులతో కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు నమ్మించి చివరకు మోసం చేయాలనీ ఆ డీల్ సారాంశం. ఆ తరువాత తనకు ఇంట్లో మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురారు అనేది నాగార్జున ప్లాన్ అనమాట. అయితే ఈ ప్లాన్ ఎలా బెడిసికొట్టింది, డీల్ గా మొదలైన ప్రేమ చివరకు ఏమైంది అనేదే కథాంశం. ఈ కథలో మంచి కామెడీతో పాటు కుటుంబ పరమైన సెంటిమెంట్ కు కూడా ఆస్కారం ఉంది. ఇక డైరెక్టర్ పనితనం పైనే సినిమా ఆధారపడి ఉంది. (ఇది కేవలం టీజర్ ను బట్టి, వస్తున్నా ఫ్రీమేక్ ర్యూమర్స్ ని బట్టి అల్లిన కథ మాత్రమే)…

Loading...