మన్మధుడు 2 సినిమా కాపీయేనట

734
మన్మధుడు 2 సినిమా కాపీయేనట
మన్మధుడు 2 సినిమా కాపీయేనట

మన్మధుడు 2 సినిమా కాపీయేనట …. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఒక ప్లాప్ డైరెక్టర్ తో తెరకెక్కిస్తున్న చిత్రం మన్మధుడు 2 .. గతంలో ఈ దర్శకుడు హీరోగా ఫెయిల్ అయి, దర్శకుడిగా ఫెయిల్ అయి, ఇప్పుడు తన భార్య స్నేహితురాలయిన సమంత సహాయంతో ఎలాగోలా మన్మధుడు సినిమా దక్కించుకున్నాడు. వరుస ప్లాపులతో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో నాగార్జునతో రొమాన్స్ చేయనుంది. ఇలాంటి దర్శకులు ఖచ్చితంగా గతంలో ఏదో ఒక భాషలో వచ్చిన సినిమా ఇన్స్పిరేషన్ తోనే ముందుకి వెళతారు అనేది అందరికి తెలిసిన విషయమే. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ విడుదల చేసారు. పెద్దగా పసలేని ఈ టీజర్ కూడా ప్రభాస్ సాహో టీజర్ తోపాటు విడుదల చేయటం, సినిమా కూడా సాహో కు ఒక వారం ముందు మాత్రమే విడుదల చేయటం మరి డేరింగ్ స్టెప్పో లేక డిజాస్టర్ స్టెప్పో త్వరలో తేలిపోనుంది. ఇక రీసెంట్ గా విడుదలైన టీజర్ తో ఈ సినిమా ఒక ఫ్రెంచ్ సినిమా కు కాపీ అని, ఫ్రీ మేక్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

2006 లో విడుదలైన “prete moi ta main (I DO)” అనే ఫ్రెంచ్ సినిమాకు ఇది ఫ్రీమేక్ అంటున్నారు. ఆ సినిమాలో హీరో తల్లి, ఐదుగురు సోదరీమణులతో నివసిస్తూ ఉంటాడు. 43 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాదు. ఈ హీరోగారిని భరించలేక ఇతనికి పెళ్లి చేద్దామని ప్రయత్నిస్తూ వుంటారు సిస్టర్స్. పెళ్లి గోల ఎక్కువవడంతో ఒక అమ్మాయితో అగ్రిమెంట్ చేసుకుంటాడు హీరో. లవ్ లో ఉన్నట్టు నటించి, పెళ్లి కూడా ఒప్పుకుని, సరిగ్గా పెళ్లి ముందు హ్యాండ్ ఇవ్వాలనేది ఆ అగ్రిమెంట్. అలాచేస్తే ఇక తనని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయరు అనేది సదరు హీరోగారి అభిప్రాయం. న్యాచురల్ కామెడీతో అద్భుతం గా తెరకెక్కిన ఆ సినిమా కల్ట్ క్లాసిక్ గా చెప్పవచ్చు. అలాంటి కథతో రాహుల్ రవీంద్రన్ లాంటి దర్శకుడు మెప్పించాలంటే కష్టమే. నిజం గా ఆ సినిమానే రీమేక్ చేస్తుంటే మాత్రం, నాగార్జున పర్ఫెక్ట్ ఛాయస్ అని చెప్పవచ్చు… పెద్దగా దర్శకత్వ ప్రతిభ అవసరంలేదు కాబట్టి నాగార్జున టైమింగ్ తో మంచి హిట్ అయ్యే అవకాశం వుంది.

Loading...