బాలీవుడ్ భయపడుతున్నా సాహూ కు పోటీ ఇస్తున్న డిజాస్టర్ కాంబినేషన్ సినిమా

387
బాలీవుడ్ భయపడుతున్నా సాహూ కు పోటీ ఇస్తున్న డిజాస్టర్ కాంబినేషన్ సినిమా
బాలీవుడ్ భయపడుతున్నా సాహూ కు పోటీ ఇస్తున్న డిజాస్టర్ కాంబినేషన్ సినిమా

బాలీవుడ్ భయపడుతున్నా సాహూ కు పోటీ ఇస్తున్న డిజాస్టర్ కాంబినేషన్ సినిమా ……. నిన్న ప్రభాస్ సాహో టీజర్ విడుదలైంది. అనుకున్నట్టుగానే సోషల్ మీడియాలో టీజర్ ప్రభంజనం సృష్టించింది. బాహుబలి తో దేశం మొత్తం అభిమానుల్ని సంపాదించుకున్న ప్రభాస్ తదుపరి చిత్రం కావటంతో ఈ సినిమాపై క్రేజ్ దేశమంతా వుంది. ఆగష్టు 15 న సాహో విడుదలవుతుండటంతో బాలీవుడ్ తో సహా, అన్ని భాషల్లో సినిమాలను ప్రీపోన్, పోస్టుపోన్ చేసుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే టాలీవుడ్ లో మాత్రం ఒక డిజాస్టర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సాహో ను ఢీ కొట్టటానికి రెడీ అయింది. నాగార్జున మన్మధుడు 2 ఆగష్టు 9 న విడుదలయ్యేందుకు సిద్ధం చేస్తున్నారు. నాగార్జున ఏ ముహర్తన రామ్ గోపాల్ వర్మ లాంటి డిజాస్టర్ డైరెక్టర్ కు సినిమా ఇచ్చాడో అప్పటినుంచి కూడా అన్ని ప్లాపులే. అలాగే మన్మధుడు 2 కి దర్శకత్వం వహించిన రాహుల్ రవీంద్రన్ ఇప్పటి వరకు తనని తాను ప్రూవ్ చేసుకోలేదు. ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. మరిలాంటి డిజాస్టర్ కాంబినేషన్ తో నాగార్జున ప్రభాస్ సాహూ జోరుని ఎలా తట్టుకుంటాడో చూడాలి.

Loading...