రకుల్ ప్రీత్ సింగ్ కు భారీ షాక్

925
రకుల్ ప్రీత్ సింగ్ కు భారీ షాక్
రకుల్ ప్రీత్ సింగ్ కు భారీ షాక్

రకుల్ ప్రీత్ సింగ్ కు భారీ షాక్ ….. రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్ రిలీజ్ దేదే ప్యార్ దే సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకుంది. వడ్డీ షరబాన్ సాంగ్ భారీ హిట్ యై సినిమాపై అంచనాలు పనిచేసింది. విడుదల ముందు ఆ పాటలో మందు బాటిల్ స్థానంలో పూల గుత్తి పెట్టాలని, కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ మ్యూట్ చేయనని, లేదా మార్చాలని సెన్సార్ బోర్డు మొదటి షాకిచ్చింది. ఇక నిన్న విడుదలైన సినిమా డిజాస్టర్ టాక్ తో రకుల్ వరుస డిజాస్టర్లలో ఇది కూడా చేరిపోయింది. పెర్ఫార్మన్స్ పరం గా టబు హీరో తో సహా రకుల్ నూ డామినెటే చేసి మరో షాకిచ్చింది. యారియా, అయ్యారే, దే దే ప్యార్ దే లతో డిజాస్టర్ హ్యాట్రిక్ సాధించిన రకుల్ ప్రీత్ సింగ్ నాల్గవ సినిమా మార్జావా అక్టోబర్ రెండున విడుదలవుతుంది. ఇక తమిళ్ లోకి వెళితే అక్కడ కూడా మూడు వరుస ప్లాపుల తరువాత ఎన్జీకే విడుదలకు సిద్ధంగా వుంది. మరో సినిమా షూటింగ్ దశలో ఉంది. తెలుగులో అయితే చాలా కాలం నుంచి హిట్ లేని రకుల్ ప్రస్తుతం మన్మధుడు 2 నే నమ్ముకుంది. హిందీ లో మార్జావ విడుదలై హిట్ అయితే తప్ప బాలీవుడ్ అవకాశాలు మూసుకుపోయినట్టే. కోలీవుడ్ టాలీవుడ్ లలో కూడా దాదాపు ఇదే పరిస్థితి.

Loading...