అందరి పేర్లూ బయట పెడుతుందట

423
అందరి పేర్లూ బయట పెడుతుందట
అందరి పేర్లూ బయట పెడుతుందట

అందరి పేర్లూ బయట పెడుతుందట ….. రెండేళ్లనుంచి బయోపిక్ ల వర్షం అన్ని భాషల్లోనూ కురుస్తూనే ఉంది.. వాటిలో కొన్ని సక్సెస్ అయితే ఎక్కువ భాగం ఫెయిల్ అయ్యాయి. వీటి కోవలోనే షకీలా బయోపిక్ తెరకెక్కుతున్న విషయం విదితమే. రిచా చద్దా షకీలా పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో షకీలా కూడా ఒక చిత్ర పాత్రలో నటిస్తోంది. ఒకప్పుడు షకీలా మాయలాల స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చిన విషయం విదితమే. షకీలా సినిమా వస్తుందంటే తమ సినిమాలను పోస్టుపోన్ లేదా ప్రీపోన్ చేసుకున్న స్టార్ హీరోలు సైతం వున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పటి నుంచే తనను, తన సినిమాలను తొక్కేసేందుకు స్టార్ హీరోలు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్న షకీలా, తాజాగా తెరకెక్కుతున్న బయోపిక్ లో ఆ విషయాల్ని, ఆ వ్యక్తుల (స్టార్ హీరోలు) పేర్లను బయట పెట్టనున్నట్టు సంకేతాలిచ్చింది. అయితే అసలు బజ్ లేని ఈ బయోపిక్ కు ఎంతో కొంత పబ్లిసిటీ కల్పించటం కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంది అంటూ కొట్టిపారేసే వారూ లేకపోలేదు.

Loading...