ముఖానికి రంగేసుకుని ఆరునెలలు దాటేసింది

276
ముఖానికి రంగేసుకుని ఆరునెలలు దాటేసింది
ముఖానికి రంగేసుకుని ఆరునెలలు దాటేసింది

ముఖానికి రంగేసుకుని ఆరునెలలు దాటేసింది ….. గతేడాది డిజాస్టర్ హీరోలు అంటే రవి తేజ, నితిన్ అనే చెప్పాలి. చాలా కాలం గ్యాప్ తీసుకుని రాజా ది గ్రేట్ అంటూ ఒక మోస్తరు హిట్ తో రీఎంట్రీ ఇచ్చాడు రవి తేజ. ఆ తరువాత వరుస డిజాస్టర్లతో మరోసారి డీలా పడిపోయిన రవితేజ డిస్కో రాజా అనే సినిమా ఓకే చేసినా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. ఒక షెడ్యూల్ అయిపొయింది రెండో షెడ్యూల్ త్వరలో మొదలవుతుంది అని చిత్ర యూనిట్ చెపుతున్నా, నిజానికి ఈ నెలాఖరుకు రవితేజ షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక నితిన్ మూడేళ్ళ క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆ ఆ అనే సినిమా తో మంచి హిట్ కొట్టాడు. ఆ తరువాత లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం అనే హ్యాట్రిక్ డిజాస్టర్స్ తో మరోసారి గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం భీష్మ అనే సినిమా ఓకే చేసుకున్నా, ఇంకా పట్టాలెక్కలేదు… త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాతో నితిన్, డిస్కో రాజా తో రవి తేజ మరోసారి సక్సెస్ బాట పడతారో లేదో చూడాలి.

Loading...