జెట్ స్పీడ్ తో కెజిఎఫ్ 2 షూటింగ్

284
జెట్ స్పీడ్ తో కెజిఎఫ్ 2 షూటింగ్
జెట్ స్పీడ్ తో కెజిఎఫ్ 2 షూటింగ్

జెట్ స్పీడ్ తో కెజిఎఫ్ 2 షూటింగ్ ….. యష్ ప్రధాన పాత్రలో ఈ సంక్రాంతికి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన కెజిఎఫ్ అన్ని భాషల్లోనూ భారీ విజయం సాధించింది. మరో ఆలోచన లేకుండా సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడింది చిత్ర యూనిట్. అనుకున్నదే తడువుగా షూటింగ్ మొదలు పెట్టిన కెజిఎఫ్ 2 శరవేగంగా తెరకెక్కే పనిలో ఉంది. ప్రస్తుతం బెంగళూరు లో షూటింగ్ జరుపుకుంటుంది. తరువాత మైసూర్ లో ఆ తరువాత రామోజీ ఫిలిం సిటీ లో వరుస షెడ్యూల్స్ జరుపుకోనుంది. ఆతరువాత మేజర్ పార్ట్ బళ్లారిలో తెరకెక్కించనున్నారు. దీంతో 90 శాతం సినిమా పూర్తవుతుందట… బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం నటిస్తున్న కెజిఎఫ్ 2 మొదటి పార్టును మించి యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట… బహుశా వచ్చే సంక్రాంతికి విడుదల ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.

Loading...