నటి సురేఖావాణి భర్త మృతి

8751
నటి సురేఖావాణి భర్త మృతి
నటి సురేఖావాణి భర్త మృతి

నటి సురేఖావాణి భర్త మృతి …. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి భర్త సురేష్ తేజ ఈ రోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. సురేఖావాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఏ హీరోయిన్ కి తీసిపోని అందం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొదట్లో మొగుడ్స్ పెళ్లామ్స్ అనే టీవీ షో తో బాగా పాపులర్ అయింది సురేఖా వాణి. ఆ ప్రోగ్రాం దర్శకుణ్ణే ఆ తరువాత పెళ్లి చేసుకుంది. ఆయన డైరెక్ట్ చేసిన మొగుడ్స్ పెళ్లామ్స్, మాటాకీస్, హార్ట్ బీట్ వంటి టీవీ షోల్లో సురేఖ వాణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ గా వుండే సురేఖావాణి కూతురు తో కలిసి డాన్స్ చేయటం, ఫోటోలు షేర్ చేయటం చేస్తుంది.ఆ ఫోటోలు, డాన్స్ వీడియో లు బాగా వైరల్ అవటం తో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మిలియన్స్ కి చేరుకుంది.

Loading...