అంచనాలందుకున్న మజిలీ

304
Naga chaitanya Majili Movie Review | అంచనాలందుకున్న మజిలీ, Majili movie review, Naga chaitanya, Samantha, నాగ చైతన్య, సమంత, మజిలీ మూవీ రివ్యూ, మజిలీ రివ్యూ
Naga chaitanya Majili Movie Review | అంచనాలందుకున్న మజిలీ, Majili movie review, Naga chaitanya, Samantha, నాగ చైతన్య, సమంత, మజిలీ మూవీ రివ్యూ, మజిలీ రివ్యూ

Naga chaitanya Majili Movie Review | అంచనాలందుకున్న మజిలీ … శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్, రావు రమేష్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన మజిలీ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. నాగచైతన్య సమంత హిట్ ఫైర్ కావటం, వివాహానంతరం కలిసి నటించిన మొదటి చిత్రం కావటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ విడుదలైన తరువాత సినిమా నేటివిటీ కి చాలా దగ్గరగా ఉంది అనే ఫీలింగ్ కలగటంతో ఆ అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

Majili movie pre- release business | ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లు (అన్ని కలిపి)… సాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ కలిపి 18 కోట్లు, థియేటర్ బిజినెస్ 21.14 కోట్లు. అంటే దాదాపుగా 19 కోట్ల పైన టేబుల్ ప్రాఫిట్ తో ఈ సినిమా విడుదలవుతుంది. ఏరియా వైజ్ బిజినెస్ చుస్తే నైజామ్ 6 కోట్లు, సీడెడ్ 2.5 కోట్లు, వైజాగ్ 1.98 కోట్లు, ఈస్ట్ వెస్ట్ 2.56 కోట్లు, కృష్ణ 1.28 కోట్లు, గుంటూరు 1.62 కోట్లు, నెల్లూరు 0.7 కోట్లు, కర్ణాటక (అల్ ఇండియా) 1.5 కోట్లు, ఓవర్సీస్ 3 కోట్లు బిజినెస్ చేసింది మజిలీ చిత్రం.

Majili movie review | షైన్ స్క్రీన్స్ నిర్మించిన మజిలీ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ తో అక్కినేని ఫాన్స్ కు ముందు రోజే ఉగాది పండగ చేసాడు. దీనికి తోడు సమంత, రావు రమేష్ ల పెర్ఫార్మన్స్ కూడా అద్భుతంగా ఉండటం తో సెంటిమెంట్ పండి సినిమా సక్సెస్ అయిందనే చెప్పాలి. కథ విషయానికి వస్తే క్రికెటర్ పూర్ణ (నాగ చైతన్య) పెళ్ళికిముందు ఒక ఆర్మీ ఆఫీసర్ కుమార్తె అన్షు (దివ్యంషా కౌశిక్) తో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ ఫెయిల్ అయిన పూర్ణ ముందుకి బానిసవుతాడు. కొన్నాళ్ళకు శ్రావణి (సమంత) తో వివాహం జరుగుతుంది. లవ్ ఫెయిల్యూర్ నుంచి ఇంకా బయటకు రాని పూర్ణ భార్యతో సఖ్యంగా వుండలేకపోతాడు. ఆ తరువాత కొన్నాళ్ళకు ఉద్యోగం చేయాలనీ నిర్ణయించుకుని డెహ్రాడూన్ వెళ్తాడు. అక్కడ అనుకోకుండా అన్షు కూతురు తో పరిచయం ఏర్పడుతుంది పూర్ణకు. ఆమెకు క్రికెట్ పై ఉన్న ఇంటరెస్ట్ తో ఆమెను ఇంటికి తీసుకొస్తాడు పూర్ణ.. ఆమెకు కోచ్ గా మారి క్రికెట్ నేర్పుతుంటాడు పూర్ణ. ఆ పాప పూర్ణ ను శ్రావణి ని ఎలా దగ్గరకు చేర్చింది అనేదే క్లుప్తంగా సినిమా కథ. సమంత మామగా రావు రమేష్ నటన, సెంటిమెంట్ తో పాటు సినిమా అంతా కూడా కుటుంబం మొత్తం చూడతగ్గ సినిమా. క్లాస్ సెంటర్స్ వరకు ఈ సినిమా సూపర్ హిట్టే. మాస్ ప్రేక్షకులకు కూడా నచ్చితే ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ బెస్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది…

Loading...