రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ బయోపిక్ ఒక బిస్కెట్టేనా ??

81
రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ బయోపిక్ ఒక బిస్కెట్టేనా ??
కేసీఆర్ బయోపిక్ ఒక బిస్కెట్టేనా ??

రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ బయోపిక్ ఒక బిస్కెట్టేనా ?? … రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సినిమా లక్ష్మి’స్ ఎన్టీఆర్ విడుదల తేదీని 29 కి మార్చినా, విడుదల ఇంకా ప్రశ్నర్ధకంగానే ఉంది.. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పై నమ్మకముంది. ఈ సినిమా ను అడ్డుకునే ప్రయత్నాలను చంద్రబాబు ముందుకి సాగనివ్వడు అంటూ స్వరం మార్చిన వర్మ కొత్తగా కేసీఆర్ బయోపిక్ చేయబోతున్నట్టు ప్రకటించి మరో సంచలనానికి తెర తీసాడు. అయితే ఇది కేవలం తన సినిమాకు తెలంగాణ లో పబ్లిసిటీ కోసమే అని అనలిస్టులు కొట్టిపారేస్తున్నారు.

ఇలా అనౌన్స్ చేయటం, అప్పుడప్పుడు టీజర్ కూడా కట్ చేయటం, ఆ తరువాత అటకెక్కించేయటం రామ్ గోపాల్ వర్మ కి కొత్తేమి కాదు… ఇప్పటికే దాదాపు గా ఒక పది సినిమాల వరకు వర్మ అనౌన్స్ చేసి అటకెక్కినవి ఉన్నాయి… సో ఇది కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ అనే వారు కొంతమంది అయితే, మరి కొంతమంది కేసీఆర్ బయోపిక్ ఏ పాయింట్ ఆధారంగా తీస్తాడు అని చర్చించుకుంటున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఏమి తీసినా జనం చూసేందుకు సిద్ధంగా లేరు అనేది జగమెరిగిన సత్యం. రీసెంట్ గా వచ్చిన అన్ని సినిమాలు ఆ పాయింట్ ని ప్రూవ్ చేసాయి…

Loading...