అల్లు అర్జున్ తల్లిగా టబు ??

57
అల్లు అర్జున్ తల్లిగా టబు ??
అల్లు అర్జున్ తల్లిగా టబు ??

అల్లు అర్జున్ తల్లిగా టబు ?? … అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలందరితో నటించిన టబు ఆ తరువాత బాలీవుడ్ లో సెటిల్ అయిపొయింది. ఇప్పుడు కూడా బాలీవుడ్ లోనే వచ్చిన చరక్టర్లు చేసుకుంటూ కాలం గడిపేస్తుంది. గతేడాది వచ్చిన అందా ధూన్ సినిమాతో నెగటివ్ రోల్ లో దుమ్ము దులిపేసిన టబు ఆ పాత్రకు గాను ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది.

తాజాగా త్రివిక్రమ్ బన్నీ తో చేస్తున్న సినిమాలో బన్నీ తల్లి పాత్ర గురించి టాబును సంప్రదించాడు. అయితే ఇంకా ఆమె ఓకే చెప్పినట్టు అయితే తెలియలేదుగానీ, గతంలో అరవింద సమేత కోసం కూడా త్రివిక్రమ్ టబు ను సంప్రదించటం, ఆమె తిరస్కరించటం జరిగింది. అప్పుడామె రెండు సినిమాలు చేస్తూ ఉండటం తో తిరస్కరించిందని, ఇప్పుడు సినిమాలు లేవు కాబట్టి చేస్తుంది అని అంటున్నారు. చూద్దాం అధికారిక ప్రకటన వచ్చేవరకు ఏ విషయం చెప్పలేము.

Loading...