మూడుసినిమాలు ఎఫెక్ట్ అయ్యాక మేలుకున్న TFPC

123
మూడుసినిమాలు ఎఫెక్ట్ అయ్యాక మేలుకున్న TFPC
మూడుసినిమాలు ఎఫెక్ట్ అయ్యాక మేలుకున్న TFPC

మూడుసినిమాలు ఎఫెక్ట్ అయ్యాక మేలుకున్న TFPC … సాటిలైట్, హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ తో దాదాపుగా తెలుగు సినిమాలకు పెట్టుబడి వచ్చేస్తుంది. దీంతో పెద్దగా థియేటర్ రిలీజ్ పై రిస్క్ ఉండదు. పెట్టిన పెట్టుబడి త్వరితగతిన రికవర్ చేసుకునే ఉద్దేశ్యంతో ప్రతుతం టాలీవుడ్ లో సినిమాలు అన్ని కూడా ముందుగానే హిందీ డబ్బింగ్, సాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మేస్తున్నారు. డిజిటల్ రైట్స్ తీసుకున్న అమెజాన్ వారి రూల్స్ ప్రకారం, సినిమా విడుదలైన 30 రోజుల తరువాత ఎప్పుడైనా స్ట్రీమ్ చేసుకోవచ్చు. దీని వాళ్ళ నిర్మాతలకు ఏమి లాస్ లేకపోయినా, సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కు ఇబ్బందిగా మారింది. ఈరోజుల్లో ఏ సినిమా కూడా 30 రోజులు థియేటర్ లో ఉండకపోయినా, కొన్ని సినిమాలు మాత్రం 30 రోజుల తరువాత కూడా కాసుల వర్షం కురిపిస్తున్నాయి,..

ఇప్పటికే ఈ సంవత్సరం అలాంటి సినిమాలు మూడు అమెజాన్ దెబ్బ తిన్నాయి. తెలుగులో ఎఫ్ ౨, కన్నడలో కెజిఎఫ్, తమిళం లో 96 సినిమాలు ఈ అమెజాన్ వల్ల దెబ్బ తిన్నాయి. దీంతో నిన్న TFPC (తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్) ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి సినిమా విడుదలైన 8 వారాలవరకు డిజిటల్ ప్లాట్ఫారం పై సినిమా స్ట్రీమ్ చేయకూడదు. ఈ రూల్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది. ఇది డిస్ట్రిబ్యూటర్స్ కి ఊపిరి పీల్చుకునే నిర్ణయమే అయినా, నిర్మాతలకు మాత్రం కొంత గడ్డి కొట్టనుంది. ఆటోమేటిక్ గా డిజిటల్ రైట్స్ విలువ భారీగా తగ్గే అవకాశం ఉంది.. ప్లస్ మైనస్ లు అమలైన కొన్ని నెలలకు గానీ అంచనా వేయలేము…

Loading...