పబ్లిసిటీ లేకుండానే మహానాయకుడు… యూట్యూబ్ లో ట్రైలర్

57
NTR Mahanayakudu Preview
NTR Mahanayakudu Preview

NTR Mahanayakudu Preview | పబ్లిసిటీ లేకుండానే మహానాయకుడు… యూట్యూబ్ లో ట్రైలర్ ….  ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు కమర్షియల్ గా సక్సెస్ కాకపోవటంతో బాలయ్య క్రిష్ తమ స్ట్రాటజీ కొంత మార్చినట్టు తెలుస్తుంది…  మొన్నటివరకు ఎన్నో ర్యూమర్స్ మధ్య కొట్టుమిట్టాడిన మహానాయకుడు బాలయ్య సరైన సమయంలో స్పందించటంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.. మహానాయకుడు సినిమాను కథానాయకుడు బయ్యర్లకు ఫ్రీ గా ఇవ్వట్లేదని, సురేష్ బాబు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయనున్నాడని చాల ర్యుమర్లు ఫిలింనగర్ లో చక్కర్లు కొట్టాయి… బాలయ్య సమయం మించకుండా స్పందించి మహానాయకుడు సినిమాను కథానాయకుడు బయ్యర్లకి ఇచ్చేటట్టు, అలాగే కథానాయకుడు నష్టాల్లో మూడోవంతు స్వయంగా భరించేట్టు, మహానాయకుడు లాభాల్లో 40  శాతం వాటా బయ్యర్లకు ఇచ్చేట్టు ఒప్పందం చేసుకున్నాడు.. దీంతో బయ్యర్ల ఆనందానికి అవధుల్లేవు… 22న విడుదలవుతున్న మహానాయకుడు పబ్లిసిటీ పనుల్లో వారు బిజీగా వున్నారు.అసలు విషయం లోకి వెళితే …

ముందు అనుకున్నట్టుగా మహానాయకుడు ట్రైలర్ హంగు ఆర్భాటాలతో కాకుండా సింపుల్ గా యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు.. బాలయ్య గానీ ఆయన టీమ్ గాని ప్రోమోషన్స్ లో పాల్గొనే అవకాశం లేదు… అయితే ఇన్నోవేటివ్ గా విడుదల తరువాత తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య తిరుగుతూ ప్రచారం చేసేటట్టు ప్లాన్ చేస్తున్నారు…. అంటే హైప్ లేకుండా విడుదల చేసి ఆ తరువాత హైప్ పెంచే ప్లాన్ అనమాట… మొదటి భాగంలో మిస్ అయిన మసాలాలన్నీ కూడా రెండో భాగంలో పుష్కలంగా ఉంటాయని… ఈ సినిమా అభిమానులను నిరుత్సాహపరచదని ఇన్సైడ్ టాక్..

Loading...