రాంచరణ్ ని భయపెడుతున్న ఎన్టీఆర్ .

60

రాంచరణ్ ని భయపెడుతున్న ఎన్టీఆర్ .


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తొలి తెలుగు స్వాతంత్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా చిత్రిస్తున్న సినిమా సైరా.భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఒకవైపు హీరోగా వేరే సినిమాలతో బిజీగా ఉంటూనే.. నిర్మాతగా కూడా తన తండ్రి నటిస్తున్న సినిమా భాద్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నాడు. రీసెంట్ గా’సైరా’ సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ‘సైరా’ కోసం పాటల రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక పాటకు అద్భుతమైన సాహిత్యం అందించారట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను ఆయన గొప్పదనాన్ని కీర్తిస్తూ ఈ పాట సాగుతుందట.

ఈ పాటలో సిరివెన్నెల ‘చిరంజీవి’ అనే పదాన్నిఎక్కువ సార్లు ఉపయోగించారట. అది రామ్ చరణ్ కు అంతగా నచ్చలేదట.. అది మనకు మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలాగా ఉంటుందని చెప్పి ఆ పదాలను తీసివేయమని సిరివెన్నెలను కోరాడట.దీంతో సిరివెన్నెల ‘చిరంజీవి’ అనే పదాన్ని తొలగించి ఆ పదానికి సరిపోయే వేరే పదాలతో పాటను పూర్తి చేశారట.ఈ మధ్య ఆ విషయాన్ని రీసెంట్ గా చిరంజీవి – సిరివెన్నెల వెల్లడించారు. సిరివెన్నెలకు ఈమధ్య పద్మశ్రీ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ఆయనకు అభినందనలు చెప్పటానికి చిరంజీవి కలిసినప్పుడు ఈ విషయం తెలిపారు.రాంచరణ్ ఎందుకు ఇలా బయపడటానికి కారణం ఏమిటంటే సెల్ఫ్ డబ్బా ఎఫెక్ట్ ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ ఫలితంపై తీవ్రంగా పడిందని.. దీంతో చరణ్ సెల్ఫ్ డబ్బాకు ఆమడ దూరం ఉంటూ జాగ్రత్త పడుతున్నాడని కూడా సినీవర్గాలు కామెంట్ చేస్తున్నారు.

Loading...