ఇస్మార్ట్ శంకర్ కు ఇద్దరు బ్యూటీలు.. బాలీవుడ్ విలన్

71
ఇస్మార్ట్ శంకర్ కు ఇద్దరు బ్యూటీలు.. బాలీవుడ్ విలన్
ఇస్మార్ట్ శంకర్ కు ఇద్దరు బ్యూటీలు.. బాలీవుడ్ విలన్

ఇస్మార్ట్ శంకర్ కు ఇద్దరు బ్యూటీలు.. బాలీవుడ్ విలన్ .. రామ్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ఇస్మార్ట్ శంకర్ టైటిల్ నిర్ణయించిన విషయం తెలిసిందే… ప్లాపుల్లో ఉన్న హీరో డైరెక్టర్ కలిసి సినిమా చేయటమే కాకుండా ఇది ఇద్దరికి కమ్ బ్యాక్ సినిమాలా ఉండేట్టు జాగ్రత్త తీసుకుంటున్నారు… ఈ సినిమా తో మరో కొత్త ప్రయోగం చేస్తున్నాడు పూరీ జగన్నాథ్.. స్ప్లిట్ పర్సన్యాలిటీ అనే సబ్జెక్ట్ ని టచ్ చేస్తూ నడుస్తుంది సినిమా…

ఇప్పటికే హీరోయిన్‌గా నిధి అగర్వాల్ ను ఫిక్స్ చేశారు.. కన్నడ బ్యూటీ నభా నటేష్ కూడా మరో ముఖ్య పాత్రలో నటిస్తుంది.. ఇదిలా ఉంటే విలన్ గా బాలీవుడ్ నటుడు సుధాన్షు నటించనున్నాడు.. కథలో ట్విస్ట్ ఇచ్చే పాత్రలో సుధాన్షు కనిపిస్తాడట…మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పూరీ జగన్నాధ్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు… చార్మీ కూడా సహా నిర్మాతగా ఉంటూనే ప్రొడక్షన్ పనులు చూసుకుంటుంది…

Loading...