వినయ విధేయ రామ మూవీ రివ్యూ

100

Ram Charan Vinaya Vidheya Rama Review | వినయ విధేయ రామ మూవీ రివ్యూ | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ భామ కైరా అద్వానీ జంటగా నటించిన తాజా చిత్రం “వినయ విధేయ రామ”. మాస్ చిత్రాలతో దర్శకుడిగా ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివివి ఎంటెర్టైమెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాపై మొదటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసాయి. ఇకపోతే, ఈ చిత్రం అన్ని కార్యక్రమాలని ముగించుకుని ఈ రోజు (జనవరి 11న) భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పుడు మన సమీక్షలో చూద్దాం సినిమా ఎలా ఉందొ!

Vinaya Vidheya Rama Movie Review
Vinaya Vidheya Rama Movie Review

నటీనటులు మరియు సాంకేతిక వర్గం:

నటీనటులు: రామ్ చరణ్, కైరా అద్వానీ, వివేక్ ఓబ్రాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, మధునందన్, రవి వర్మ, తదితరులు.
కథ, స్రీన్ ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ – ఆర్థర్ ఏ విల్సన్
నిర్మాత డివివి దానయ్య
నిర్మాణ సంస్థ: డివివి ఎంటెర్టైమెంట్

కథ:
దర్శకుడు బోయపాటి సినిమాలో మాస్, యాక్షన్ సన్నివేశాలకి కొదవ ఉండదు. ఆయన ఏ తరహా కథని ఎంచుకున్న అందులో మాస్ ప్రేక్షకులకి నచ్చే అంశాలని పుష్కలంగా ఉండే విధంగా చూసుకుంటారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే, రామ్ కొణిదెల (రామ్ చరణ్) ఫ్యామిలిలో అందరికంటే చిన్నవాడు. రామ్ కి నలుగురు అన్నయ్యలు (ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, మధునందన్, రవి వర్మ). రామ్ అందరికంటే చిన్న వాడు కావడంతో అతనంటే కుటుంబానికి చాల ఇష్టం. ఇకపోతే, రామ్ పెద్ద అన్నయ్య (ప్రశాంత్) విశాఖలో ఎలక్షన్ కమిషనర్ గా పని చేస్తుంటాడు.

Vinaya Vidheya Rama Movie Review : Ram Charan VVR Movie Review, Vinaya Vidheya Rama Telugu Movie Review, Vinaya Vidheya Rama Review In Review, Kiara Advani, Vivek Oberoi.
Ram Charan VVR Movie Review

అయితే, ఉప ఎన్నికలు జరిగే సమయంలో పందెం పరశురామ్ (ముకేశ్ రుషి) చేసే అరాచకాలు, అన్యాయాల్ని నిలదీస్తూ బయట పెడతాడు. ఇక, ఈ విషయం తెలుసుకున్న పందెం పరశురామ్, రామ్ అన్నయ్యకి మధ్య గొడవ జరుగుతుంది. ఇక అప్పటి నుండి రామ్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం మొదలు పెడతారు. ఇందుకోసం బీహార్ లోని మున్నా భాయ్ (వివేక్ ఓబ్రాయ్) ని రంగం లోని దింపుతారు. అయితే, మున్నా భాయ్ వల్ల రామ్ కుటుంబానికి జరిగిన నష్టం ఏంటి? అలాగే, రామ్ మున్నా భాయ్ నుండి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? అన్న విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ప్లస్ పాయింట్స్:
ఇంటర్వెల్ ఎపిసోడ్స్
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్:
స్టోరీ, స్క్రీన్ ప్లే మరియు డైరెక్షన్
సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సెకండ్ హాఫ్
యాక్షన్ సన్నివేశాలు ఎక్కువయ్యాయి.

Ram Charan Vinaya Vidheya Rama Review
Ram Charan Vinaya Vidheya Rama Review

విశ్లేషణ:

ఇక సినిమాలో నటీనటుల విషయానికి వస్తే, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో ఆయనకి నటనకి ప్రాధాన్యత లభించిందని చెప్పాలి. ఎందుకంటే, ఇందులో ఫ్యామిలీతో, పోరాట సన్నివేశాల్లో, హీరోయిన్ తో వచ్చే సన్నివేశాల్లో రామ్ చరణ్ తనదైన శైలి లో నటించి మెప్పిస్తారు. ఇక, ఈ సినిమాలో హీరోయిన్ హీరోయిన్ గా నటించిన కైరా అద్వానీ పర్వాలేదనిపించుకున్న ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇకపోతే, రామ్ కి అన్నయ్యలుగా నటించిన ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, మధునందన్, రవి వర్మ వారి పాత్రలకి పూర్తిగా న్యాయం చేసారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే, ఎలక్షన్ కమిషనర్ పాత్రలో నటించిన ప్రశాంత్ ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. ఇక, బాలీవుడ్ హీరో వివేక్ ఓబ్రాయ్ విలన్ పాత్రలో ఆయన నటన అందరిని ఆకట్టుకుంటుంది.

VVR Review
VVR Review

ఇక, దర్శకుడు బోయపాటి విషయానికి వస్తే, మాస్ తరహా చిత్రాలను తెరకెక్కించడంలో ఆయనకంటూ ప్రత్యేకమైన శైలీ ఉంది. అయితే, ఈ చిత్రంలో పాత్రలకి తగ్గట్లు మంచి నటీనటుల్ని ఎంచుకున్న కథను ప్రేక్షకులకి నచ్చే విధంగా మలచడంలో కథ విఫలం అయ్యాడని చెప్పక్కతప్పదు. ఎందుకంటే, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని విభాగాల్లో దర్శకుడు తన మార్క్ ని పూర్తి స్థాయిలో చూపించలేక పోయారు.

వైలెన్స్, యాక్షన్ సన్నివేశాలు కూడా ఎక్కువవ్వడం ప్రేక్షకులకి కాస్త ఇబ్బంది కలిగించే అంశం. దీనికి తోడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ఇకపోతే, నిర్మాణ విలువలు బాగున్నాయి, ఇంటర్వెల్ వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని చెప్పాలి.

Vinaya Vidheya Rama Review In Telugu
Vinaya Vidheya Rama Review In Telugu

తీర్పు:
మొత్తంగా చెప్పాలంటే, రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఈ సినిమా పై కూడా అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, ఈ చిత్రం అందరి అంచనాలను అందుకోలేకపోయింది. అతి వైలెన్స్, కథలో బలమ్ లేకపోవడం వంటి అంశాలు ప్రేక్షకులని కాస్త నిరాశకి గురి చేసిందని చెప్పక తప్పదు. అయితే, సెకండ్ హాఫ్ తో పోలిస్తే, ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులకి నచ్చుతాయి. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఉండబోతుందో చూడాలి!

Also Read:

వినయ విధేయ రామ రివ్యూ (ఆంగ్లం లో)

రజినీకాంత్ పేట మూవీ రివ్యూ

గ్ల్యామర్ గేట్‌లెత్టిందీ… విజయ్ దేవరకొండ పక్కన చాన్స్ కొట్టేసింది!

ప్లాప్ హీరో ప్లాప్ హీరోయిన్ డేటింగ్ … బికిని ఫోటోలు పోస్ట్ చేసిన హీరోయిన్!