ఎఫ్2 మూవీ ప్రివ్యూ | F2 Movie Preview

142

F2 Movie Preview | ఎఫ్2 మూవీ ప్రివ్యూ | మెగా ప్రిన్స్ వరుణ్, విక్టరీ వెంకటేష్ కలయికలో వస్తున్న భారీ మల్టి స్టారర్ చిత్రం “ఎఫ్2” (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రవి పూడి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. మొదటి నుండే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే అందరిని అమితంగా ఆకట్టుకోవడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే, అన్ని కార్యక్రమకాని ముగించుకొని ఈ చిత్రం రేపు (జనవరి 12న) విడుదల కాబోతుంది.

F2 Telugu Movie Preview
F2 Telugu Movie Preview

నటీనటులు మరియు సాంకేతిక వర్గం:
నటీనటులు : వరుణ్, విక్టరీ వెంకటేష్, తమన్నా, మెహరీన్, తదితరులు.
దర్శకత్వం : అనిల్ రవి పూడి
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి
ఎడిటర్ : తమ్మిరాజు
నిర్మాత : దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ: జనవరి 12, 2019

F2 Preview
F2 Preview

ప్రీ రిలీజ్ బిజినెస్:
టీజర్, ట్రైలర్ తో అందరిని దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా 34.5 కోట్లు జరిగినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకొని ఈ చిత్రం 28 కోట్ల వరకు బిజినెస్ చేసిందని తెలుస్తుంది. భారీ మల్టి స్టారర్ కావడం, అందులోనూ ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఉండబోతుందో చూడాలి.

F2 Movie Preview
F2 Movie Preview

ఎఫ్ 2 కథ:
ఇక సినిమా కథ విషయానికి వస్తే, కామెడీ మరియు ఫ్రస్టేషన్ ను ప్రధాన అంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తుంది. కథలో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ రెండు కూడా సమపాళ్లలో ఉండబోతున్నాయట. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రవి పూడి ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే విధంగా తన మార్క్ ఎక్కడ కూడా మిస్సవ్వకుండా తెరకెక్కించారట. ఈ సినిమాలో భార్య భర్తల మధ్య ఉండే ఫన్ అలాగే ఫ్రాస్టేషన్ ని దర్శకుడు తనదైన శైలిలో తెరకెక్కించాడని సమాచారం.

Venkatesh Varun Tej F2 Movie Review
Venkatesh Varun Tej F2 Movie Review

ఎఫ్ 2 రన్ టైం & సెన్సార్:
కాగా, ఈ చిత్రం సెన్సార్ సభ్యల నుండి యూ/ఏ సర్టిఫికెట్ పొందడంతో పాటు వారి ప్రశంశలు కూడా పొందినట్లు సమాచారం. 147 నిమిషాల నిడివిగల ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించే విధంగా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ ఇది పక్క ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పసేయి.

సంక్రాంతి అల్లుళ్లు:
ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండగా సందర్బంగా తెలుగులో నాలుగు భారీ బడ్జెట్ సినిమా విడుదలవడంతో తెలుగు ప్రేక్షకులకి సంక్రాంతి పండగా ముందే వచ్చినట్లైంది. అయితే, ఇప్పటికే నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “పెట్టా”, మెగా పవర్ స్టార్ నటించిన “వినయ విధేయ రామ” సినిమాలు విడుదలయ్యాయి.

F2 Telugu Movie
F2 Telugu Movie

ఇకపోతే, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కానీ, వసూళ్లు మాత్రం కాస్త డల్ గానే ఉన్నాయి. అయితే, రేపటి నుండి సంక్రాంతి సెలవులు కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాల అంచన. ఇక, పెట్టా సినిమా వెలుగులో పేట పేరుతో విడుదలైంది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన తెలుగులో థియేటర్స్ కొరత ఉండటంతో భారీ విజయాన్ని నమోదు చేసే దాఖలాలు కనబడటంలేదు.

F2 Grand Release Tomorrow
F2 Grand Release Tomorrow

అయితే, ఈ రోజు విడుదలైన వినయ విధేయ రామ సినిమాపై అటు మెగా అభిమానులతో పాటు ఇటు ఇండస్ట్రీ వర్గాలు కూడా చాల ఆశలు పెట్టుకున్నాయి. కానీ, ఈ చిత్రం ప్రీమియర్ షోల నుండే నెగటివ్ టాక్ రావడంతో, రేపు విడుదల కాబోతున్న ఎఫ్ 2 సినిమాకి కలిసొచ్చినట్లయింది.. కాగా, ఎఫ్ 2 సినిమా ఫ్యామిలీ సబ్జెక్ట్ తో మంచి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కడంతో ఈ సారి సంక్రాంతి అల్లుళ్లదే హావ ఉండేలా ఉంది. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుందో తెలియాలంటే, రేపటి వరకు వేచిచూడాల్సిందే!

Also Read:

వినయ విధేయ రామ మూవీ రివ్యూ (తెలుగులో)

రజినీకాంత్ పేట మూవీ రివ్యూ

గ్ల్యామర్ గేట్‌లెత్టిందీ… విజయ్ దేవరకొండ పక్కన చాన్స్ కొట్టేసింది!

ప్లాప్ హీరో ప్లాప్ హీరోయిన్ డేటింగ్ … బికిని ఫోటోలు పోస్ట్ చేసిన హీరోయిన్!

సంక్రాంతి అల్లుళ్ళదే హవా… లైన్ క్లియర్ చేసిన బాలయ్య రామ్‌చరణ్

Watch F2 Telugu Movie Videos, Teaser, Trailer and Journey Of F2 | Venkatesh, Varun Tej, Tamannah, Mehreen, Anil Ravipudi, Dil Raju.