సంక్రాంతి అల్లుళ్ళదే హవా… లైన్ క్లియర్ చేసిన బాలయ్య రామ్‌చరణ్

76
సంక్రాంతి అల్లుళ్ళదే హవా... లైన్ క్లియర్ చేసిన బాలయ్య రామ్‌చరణ్
సంక్రాంతి అల్లుళ్ళదే హవా… లైన్ క్లియర్ చేసిన బాలయ్య రామ్‌చరణ్

సంక్రాంతి అల్లుళ్ళదే హవా… లైన్ క్లియర్ చేసిన బాలయ్య రామ్‌చరణ్… ఈ సంక్రాంతి కి మూడు పెద్ద సినిమాలు పోటీ పడుతున్న విషయం విదితమే… ఇందులో బాలయ్య నటించిన ఎన్ టి ఆర్ కథానాయకుడు 9 న విడుదల కాగా హిట్ టాక్ తో డల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది… ఇక రెండో సినిమా వినయ విధేయ రామ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.. రామ్‌చరణ్ బోయపాటి కాంబినేషన్ లో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించిన చిత్రం వినయ విధేయ రామ… ఈ చిత్రం ఇప్పటికే అన్ని చోట్ల ప్రదర్శించబడి ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

ఈ రెండు సినిమాల మధ్యన నిన్న విడుదలైన రజినీకాంత్ పేట పరవాలేదనిపించినా, తెలుగు లో కొన్న నిర్మాతల నోటి దూల కారణంగా థియేటర్స్ లేకుండా పోయాయి. సో దాదాపుగా ఇది కూడా పోటీలో లేనట్లే.. ఇక ఈ సంక్రాంతికి మిగిలి ఉన్న చిత్రం వెంకటేష్ వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ ఎఫ్ 2.. దిల్ రాజు నిర్మాత కావటం తో దీనికి థియేటర్స్ సమస్య లేదు… ఇక కామెడీ నేపధ్యంలో అందులోనూ భార్యా బాధితుల కామెడీ తో రోపొందిన చిత్రం కాబట్టి ఖచ్చితం గా ఫ్యామిలీ ఆడియెన్స్ వోటు ఈ సినిమాకే ఉంటుంది. 

ఏ మాత్రం పరవాలేదు అనిపించినా, ఈ సినిమా మిగిలిన సినిమాలను వెనక్కి నెట్టే అవకాశం ఉంది. ఎలాగో రామ్‌చరణ్ సినిమా వినయ విధేయ రామ ప్లాప్ అయినా ఎక్కువ కల్లెక్ట్ చేస్తుంది అనటంలో సందేహం లేదు…. అలాగే ఎన్ టి ఆర్ బయోపిక్ హిట్ టాక్ వచ్చినా, ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేయటంతో లాంగ్ రన్ అవకాశం లేదు…. ఇక ఇప్పటికయితే సంక్రాంతి అల్లుళ్ళదే హవా…. ఎఫ్2 భవిష్యత్తు కూడా రేపు ఈ పాటికి తేలిపోతుంది….. ప్రస్తుతానికి అయితే బాలయ్య రామ్‌చరణ్ సినిమాలు ఎఫ్2 కి పూల బాట వేసినట్టే….

Also Read:

వినయ విధేయ రామ రివ్యూ (ఆంగ్లం లో)

రజినీకాంత్ పేట మూవీ రివ్యూ

గ్ల్యామర్ గేట్‌లెత్టిందీ… విజయ్ దేవరకొండ పక్కన చాన్స్ కొట్టేసింది!

ప్లాప్ హీరో ప్లాప్ హీరోయిన్ డేటింగ్ … బికిని ఫోటోలు పోస్ట్ చేసిన హీరోయిన్!

Loading...
Loading...