రజినీకాంత్ పేట మూవీ రివ్యూ

86

Rajinikanth Peta Telugu Movie Review | రజినీకాంత్ పేట మూవీ రివ్యూ | సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం “పెట్టా”. సిమ్రాన్, త్రిష కృష్ణన్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బా రాజు దర్శకత్వం వహించారు. యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవి చంద్రన్ సంగీతాన్ని సమచ్చకూర్చిన ఈ సినిమాలో ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి, నాజుద్దీన్ సిద్ధిక్, బాబీ సింహ, యోగి బాబు, మేఘ ఆకాష్, తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇప్పటికే, విడుదలైన టీజర్, ట్రైలర్ అందరిని ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే, ఈ చిత్రం అన్ని కార్యక్రమాలని ముగించుకొని ఈ రోజు (జనవరి 10న) ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఇకపోతే, తెలుగులో ఈ చిత్రాన్ని పేట పేరుతో నిర్మాత అశోక్ వల్లభనేని విడుదల చేశారు. ఇప్పుడు మన సమీక్షలో చూద్దాం సినిమా ఎలా ఉందొ!

నటీనటులు మరియు సాంకేతిక వర్గం:
నటీనటులు: రజినీకాంత్, విజయ్ సేతుపతి, సిమ్రాన్, త్రిష, నవాజుద్దీన్ సిద్ధికీ, బాబీ సింహ, యోగి బాబు,మేఘ ఆకాష్ తదితరులు.
దర్శకత్వం: కార్తీక్ సుబ్బా రాజు
సినిమాటోగ్రఫీ: తీరు
సంగీతం: అనిరుద్ రవి చంద్రన్
ఎడిటింగ్: వివేక్ హర్షన్
నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్
నిర్మాతలు: అశోక్ వల్లభనేని, కళానిధి మారన్
విడుదల తేదీ: జనవరి 10, 2019

కథ:
ఇక సినిమా కథ విషయానికి వస్తే, కాళీ (రజినీకాంత్) ఒక కాలేజీలో హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తుంటాడు. అయితే, అదే కాలేజీలో పని చేసే సిమ్రాన్ తో పరిచయం ఏర్పడుతుంది. ఇక, కాళీ కాలేజీలో ఉన్న సమస్యలని తనదైన శైలిలో పరిష్కరించుకుంటూ వెళ్తాడు. అయితే, కాలేజీలో ఒక ప్రేమ జంటని కలపాల్సి వస్తుంది. ఆ సందర్భంలో అక్కడ లోకల్ గా ఉండే రౌడీలతో గొడవ పెట్టుకుంటాడు. అప్పుడే అతని పేరు కాళీ కాదు, పేట అని, అతను ఉత్తరప్రదేశ్ నుండి వచ్చాడని తెలుస్తుంది. అయితే, అప్పటికే పేట కి ఉత్తరప్రదేశ్ లోని సింహాచలం (నవాజుద్దీన్ సిద్ధికీ) తో గొడవలు ఉంటాయి. అసలు సింహాచలం తో ఉన్న విబేధాలు ఏంటి? కథలో విజయ్ సేతుపతి పాత్రేంటి? చివరికి కథ ఎలా ముగిసిందో తెలియాలంటే? సినిమా చూడాల్సిందే!

ప్లస్ పాయింట్స్:
రజినీకాంత్ నటన, మేనరిజం
ఫస్ట్ హాఫ్
రజిని, సిమ్రాన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు
అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
కథలో కొన్ని ట్విస్ట్

మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్
క్లైమాక్స్
ఓల్డ్ స్టోరీ కథ

విశ్లేషణ:
ఇక సినిమాలో నటీనటుల విషయానికి వస్తే, సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పటిలాగే ఆయన నటనతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. అయితే, ఎప్పటి నుండో రజినీకాంత్ ని ఈ తరహా కథల్లో చూడాలని అభిమానుల ఆశ, కానీ, ఇందుకు విరుద్ధం రజిని వేరే కథలు చేసుకుంటూ వెళ్లారు. అయితే, ఈ సినిమాలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో నరసింహ, ముత్తు, అరుణాచలం సినిమాలో మాదిరి రజిని కనిపించడం అభిమానులకి పండగల అనిపిస్తుంది. ఇక, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధికీ వారి పాత్రలకి తగ్గట్లు బాగానే నటించిన దర్శకుడు వారి నటనను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. సిమ్రాన్, త్రిష నటన పరవాలేధనిపిస్తుంది. ఇకపోతే, సినిమాలో నటించిన మిగతా వారు వారి పాత్రలకి తగ్గట్లు బాగానే నటించారు.

ఇక, టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బా రాజు ఈ సినిమాని పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో మొత్తం రజిని మేనరిజాన్ని చూపించడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెల్ అయ్యారు. కానీ, ఫస్ట్ హాఫ్ మొత్తం కథను రెవెల్ చేయకుండా రజిని ఫ్యాన్స్ ని మెప్పించడానికి కొన్ని కావాలని సన్నివేశాలని పెట్టారని అనుకోక తప్పదు. ఇక, సెకండ్ హాఫ్ లో పేట, కాళీ గా మారడానికి బలమైన కారణం ఉందని అందరూ అనుకుంటారు. కానీ, దర్శకుడు మాత్రం సెకండ్ హాఫ్ లో కూడా రజిని మేనేరిజాన్నే నమ్ముకున్నారు. ఇకపోతే, అనిరుద్ అందించిన పాటలు పరవాలేధనిపించిన, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరింది.

తీర్పు:
సూపర్ స్టార్ రజినికాంత్,యంగ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బ రాజు కలయికలో వచ్చిన ఈ చిత్రం రజిని ఫ్యాన్స్ కి మాత్రం పండగే అని చెప్పాలి. అయితే, దర్శకుడు ఎంచుకున్న కథ కాస్త ఓల్డ్ ఫార్మాట్ లో ఉండటం. అలాగే, సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఒక రేంజులో ఉంటుందని అందరూ భావించారు. కానీ దర్శకుడు అందుకు విరుద్ధంగా ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ ని నడిపించడం ప్రేక్షకులకి కాస్త ఇబ్బంది పెట్టె అంశం. కానీ, రజినీకాంత్ నటన, స్టైల్, మేనరిజం కోసం ఈ సినిమా తప్పక చూడవలసిందే!

Also Read:

హాట్ డ్రెస్ లో ఘాటు అందాలు … రొమ్యాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్తున్న శ్రియ

ఒరిజినల్ కాదు .. ప్లాస్టిక్ అన్నాడట

నోటి దూల ఉంటే ఇంతే… పేట కు ఇంకా తగ్గనున్న థియేటర్స్.. ??

నాకు పెళ్లితో పని లేదు .. బిగ్ బాస్ బ్యూటీ ఒవియా!

నటి ప్రియాంక విడాకులకు కారణం లీకైన ప్రైవేట్ ఫొటోలేనట