మనల్ని గెలిచే అవకాశం కాలానికి ఒక సారే ఇవ్వాలి… ఆది మనం పోయాకే …. బొమ్మ అదిరింది

199
Ntr Kathanayakudu USA review
Ntr Kathanayakudu USA review

Ntr Kathanayakudu USA review | మనల్ని గెలిచే అవకాశం కాలానికి ఒక సారే ఇవ్వాలి… ఆది మనం పోయాకే …. బొమ్మ అదిరింది … తెలుగు వాళ్ళందరు గర్వంగా తలెత్టుకునేలా చేసిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా, ఆయన తనయుడు, బాక్సాఫీస్ బొనాంజా యువరత్న నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఎన్ టి ఆర్ బయోపిక్… క్రిష్ దర్శకత్వం వహించిన ఈ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం విదితమే… రెండవ భాగం మహానాయకుడు వచ్చే నెల 7 న విడుదల అవుతుండగా, మొదటి భాగం కథానాయకుడు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది..

ఫస్ట్ హాఫ్ : అనుకున్నట్లుగానే క్రిష్ సినిమా ఎమోషనల్ ఎపిసోడ్ తో మొదలుపెట్టాడు… 1984 బ్యాక్‌డ్రొప్ లో మద్రాస్ లో క్యాన్సర్ తో పోరాడుతున్న బసవ తారకం గారు, ఆమె గురించి ఆందోళన చెందుతున్న హరికృష్ణ…అక్కడి నుంచి ఫ్ల్యాష్‌బ్యాక్ కి తీసుకు వెళ్లాడు క్రిష్… ఆది 1947 లో బెజవాడ. రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న రామారావ్ నాటకాలు సినిమాలపై ఉన్న ఆసక్తి తో ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల వేటకు మద్రాస్ వెళతాడు. రామారావ్ గారు మద్రాస్ జర్ని లో ఉన్నప్పుడు టైటిల్స్ మరియు బ్యాక్‌డ్రొప్ లో “ఘన కీర్తి సాంద్ర” సాంగ్.. కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతం అనే చెప్పాలి. మద్రాస్ లో రామారావ్ గారి స్ట్రగల్ ని కూడా చాలా పరిశోధించి చిత్రీకరించటం జరిగింది.. అతి కొద్ది కాలం లోనే పాప్యులర్ హీరో అయిన రామారావ్ గారు రాయలసీమ కరువు నేపధ్యంలో అప్పట్లోనే సాయం కోసం ముందు కొచ్చి జోలె పట్టటం, తద్వారా ప్రొడక్షన్ హౌస్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తప్పటం, సొంతగా సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకోవటం లో ఎమోషన్ బాగా పండింది… జోలె పట్టినప్పుడు “చెయ్యెత్తి జెకోట్టు తెలుగోడ” సాంగ్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఒక హైలైట్. మాయాబజార్ లో మొదటిసారి కృష్ణుడిగా రామారావ్ గారు నటించటం, ఆ తరువాత సావిత్రి తో గుండమ్మ కథ, మధ్యలో పెద్ద కుమారుడి మరణం …. ఇలా ఫస్ట్ హాఫ్ అంత ఎమోషనల్ గా, రామారావ్ గారి ఎదుగుదల, ఫ్యామిలీ స్ట్రగల్ తో అద్భుతంగా తెరకెక్కించాడు క్రిష్.. 

Ntr Kathanayakudu USA review
Ntr Kathanayakudu USA review

సెకెండ్ హాఫ్ : మనల్ని గెలిచే అవకాశం కాలానికి ఒక సారే ఇవ్వాలి… ఆది మనం పోయాకే అనే డైలాగ్ రామారావ్ గారికి ఉన్న గుండె ధైర్యాన్ని తెలియ చేసేట్టు ఉంది… అలాగే మరి కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్ రీలేషన్ మాత్రం డీప్ గా వెళ్ళకుండా ఫ్రెండ్లీ గానే చూపించారు. అలాగే సినీ దిగ్గజాలైన వీరిద్దరూ దివిసీమ ఉప్పెన సమయంలో ఫండ్స్ రైజ్ చేసి సాయం చేయటం ఉన్నది ఉన్నట్లు చూపించారు… యమగోల అడవిరాముడు ఇలా కొన్ని సినిమాలను టచ్ చేస్తూ… రామారావ్ గారు పొలిటికల్ పార్టీ అనౌన్స్మెంట్ చేయటం తోనే కథానాయకుడు ఎండ్ అయ్యింది.. నారా చంద్రబాబుగా రానా ఎంట్రీ, అలాగే ముఖ్య మంత్రి భవనం వెంకట్రామ్, నాదెండ్ల భాస్కర్ రావ్, రామోజీ రావ్ లాంటి క్యారెక్టర్స్ అన్ని కూడా కథానాయకుడు లోనే ఎంట్రీ ఇచ్చాయి. ఫస్ట్ హాఫ్ లో రామారావ్ గారిలా బాలయ్య కొంత ఆడ్ గానే కనిపించినా, సెకెండ్ హాఫ్ లో మాత్రం అద్భుతంగా సెట్ అయ్యాడు…  ఈ సినిమా ఫాన్స్ కు మాత్రం ట్రీట్… బిట్ సాంగ్స్ ఫాన్స్ కి పూనాకలు తెప్పించటం ఖాయం…

రెండో వైపు చూస్తే ఈ జెనరేషన్ పబ్లిక్ కి సినిమా కొంత లెంతీ గా అనిపించే అవకాశం ఉంది.. అలాగే స్లో పేస్డ్ మూవీ గా కూడా అనిపించే అవకాశం ఉంది… ఓవరాల్ గా చూసుకుంటే క్రిష్ ఎన్ టి ఆర్ బయోపిక్ పేరుకు తగ్గట్టె హనెస్టీ తో తెరకెక్కించాడు… ఖచ్చితంగా అందరు చూడ తగ్గ చిత్రమే…

This review was given by audience in usa …..Proffessional review will be given after 12 pm indian time… and will be updated on main website https://www.mmanacinema.com

నోటి దూల ఉంటే ఇంతే… పేట కు ఇంకా తగ్గనున్న థియేటర్స్.. ??

నటి ప్రియాంక విడాకులకు కారణం లీకైన ప్రైవేట్ ఫొటోలేనట!

ఎన్ టి ఆర్ మహానాయకుడు యాత్ర లకు పోటీగా నిత్యామీనన్ “ప్రాణ”

కనీసం ఎల్.కె.జి అయినా పాస్ అవుతుందా ??

Nithya menen “Praana” first look

నాకు పెళ్లితో పని లేదు .. బిగ్ బాస్ బ్యూటీ ఒవియా

Loading...