సంక్రాంతి సినిమాలు (ప్రివ్యూ) .. అన్నీ హిట్టే నట .. సెన్సార్ డిసైడ్ చేసేసింది మరి

191

Tollywood sankranthi 2019 releases Preview | సంక్రాంతి సినిమాలు (ప్రివ్యూ) .. అన్నీ హిట్టే నట .. సెన్సార్ డిసైడ్ చేసేసింది మరి … ఎప్పుడు లేనంతగా ఈ సారి సంక్రాంతికి నాలుగు భారీ చిత్రాలు పోటీలో ఉన్నాయి… నందమూరి బాలకృష్ణ కథానాయకుడు, రామ్‌చరణ్ వినయ విధేయ రామ. సూపర్‌స్టార్ రజినీకాంత్ పేట మరియు వెంకటేష్ వరుణ్ టెజ్ మల్టీ స్టారర్ ఎఫ్2…. ఏ సినిమాకు ఆ సినిమా వేరే వేరే జోనర్స్ లో తెరకెక్కటం, టార్గెట్ ప్రేక్షకులు కూడా విడివిడిగా ఉండటంతో అన్ని సినిమాలపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఒక్కో సినిమాకి ఒక్కో ఆకర్షణ ….

Ntr Kathanayakudu digital sattelite rights, ఎన్ టి ఆర్ కథానాయకుడు, Ntr Kathanayakudu release dateNtr Kathanayakudu pre release business, Ntr Kathanayakudu preview, Ntr Kathanayakudu review, Ntr Kathanayakudu star castNtr Kathanayakudu video songs, Ntr Kathanayakudu audio, Ntr Kathanayakudu censor talk, ఎన్ టి ఆర్ కథానాయకుడు రివ్యూ, ఎన్ టి ఆర్ కథానాయకుడు ప్రివ్యూ, ఎన్ టి ఆర్ కథానాయకుడు బిజినెస్, ఎన్ టి ఆర్ కథానాయకుడు పాటలు

Tollywood sankranthi 2019 releases
Tollywood sankranthi 2019 releases

ఎన్ టి ఆర్ కథానాయకుడు … ఈ సినిమా స్వర్గీయ విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్ టి ఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది… బయోపిక్ రెండు భాగాల్లో ఇది మొదటిది… నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్ టి ఆర్ పాత్రలో నటించి నిర్మించిన చిత్రం ఇది.. విద్యా బాలన్ ఎన్ టి ఆర్ సతీమణి బసవ తారకం పాత్రలో నటించింది.. ఇంకా ఈ సినిమాలో చాలా మంది పెద్ద స్టార్ హీరోలు హీరోయిన్లు నటించారు… ఈ సినిమా కు మొత్తం 71.3 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది… తెలుగు రాష్ట్రాల్లో 55 కోట్లు, మిగత ఇండియా 6.3 కోట్లు, ఓవర్‌సీస్ లో 10 కోట్లు బిజినెస్ చేసింది ఈ సినిమా… అలాగే శాటిలైట్ రైట్స్ మరియు డిజిటల్ ద్వారా మరో 45 కోట్లు (రెండు భాగాలు) నిర్మాతలకు అందాయి.. ఈ నెల 9 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. 1983 జనవరి 9 న ఎన్ టి ఆర్ మొదటి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే విడుదల తేదీ ఖరారు చేయటం విశేషం..ఇంకా ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలలో సుమంత్ (ఏ ఎన్ ఆర్), కల్యాణ్ రామ్ (హరికృష్ణ), రకుల్ ప్రీత్ సింగ్(శ్రీదేవి) నటించారు. తేజ డైరెక్షన్ లో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగినా ఆ తరువాత ఈ సినిమా క్రిష్ చేతికి వచ్చింది… ఇప్పటి వరకు ఈ సినిమా కు సంబంధించిన అన్ని లుక్స్, ట్రైలర్, ప్రోమో లు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చాయి… ఈ సినిమాలో నటించిన ఇతర నటీ నటుల వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Vinaya vidheya rama digital sattelite rights, వినయ విధేయ రామ, VVR release date,VVR pre release business,VVR preview,Vinaya vidheya rama review,VVR star cast,VVR video songs,VVR audio,VVR censor talk, వినయ విధేయ రామ రివ్యూ, వినయ విధేయ రామ ప్రివ్యూ, వినయ విధేయ రామ బిజినెస్,వినయ విధేయ రామ పాటలు

Tollywood sankranthi 2019 releases Preview
Tollywood sankranthi 2019 releases Preview

రామ్‌చరణ్ కైరా అద్వానీ జంటగా బోయపాటి దర్శకత్వం వహించిన చిత్రం “వినయ విధేయ రామ”… ఈనెల 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. ఈ సంవత్సరం విడుదల కానున్న అన్ని సంక్రాంతి సినిమాల్లో భారీ బిజినెస్ జరిగిన చిత్రం ఇదే..నైజామ్ లో 20 కోట్లు, ఆంధ్ర లో 57 కోట్లు, మిగతా ఇండియా అంతా 8.5 కోట్లు, ఓవర్‌సీస్ లో 9 కోట్లు వెరసి 95 కోట్లు బిజినెస్ చేసింది ఈ చిత్రం. రంగస్థలం లాంటి భారీ హిట్ తరువాత రామ్‌చరణ్ చేస్తున్న చిత్రం కావటంతో ఈ సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరిగింది… కైరా అద్వానీ కి ఇది భరత్ అనే నేను తరువాత తెలుగులో రెండో చిత్రం… ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రోమో లు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చాయి. పాటలు కొంత నెగేటివ్ టాక్ తెచ్చినా రామ్‌చరణ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో ఆ లోటు కనపడకుంటా జాగ్రత్త తీసుకుంటాడని ఫ్యాన్స్ అభిప్రాయం…. ఈ సినిమా కూడా తెలుగులో మోస్ట్ అవైటెడ్ మూవీ….

వినయ విధేయ రామ ప్రివ్యూ:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బాలీవుడ్ అందాల భామ కైరా అద్వానీ కలయికలో వస్తున్న తాజా చిత్రం “వినయ విధేయ రామ”. మాస్ తరహా చిత్రాలని తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగా సందర్బంగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

వినయ విధేయ రామ స్టోరీ?:

ఇక సినిమా కథ విషయానికి వస్తే, దర్శకుడు బోయపాటి గత చిత్రాలకి ఏమాత్రం తగ్గకుండా హై వోల్టేజ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ ఇప్పటి వరకు ఇంత మాస్ లుక్ లో ఏ సినిమాలోనూ కనిపించలేదు. అయితే, కథకు తగ్గట్లు చరణ్ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా సరిపోయిందని సమాచారం. మరి ముఖ్యంగా ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ లో రామ్ చరణ్ నటన, హావ బావాలు అద్భుతంగా పలికించాడని, ప్రేక్షకులకి సినిమా ఒక యాక్షన్ ట్రీట్ లా ఉండబోతుందని తెలుస్తుంది.

అయితే, సినిమాలో రామ్ చరణ్ ఫారిన్ నుండి చదువు పూర్తి చేసుకొని తన ఇంటికి వచ్చే సరికి, ఆ ప్రాంతాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న వివేక్ ఓబ్రాయ్ తో తన సోదరుడు ప్రశాంత్ కి ప్రాణ హాని ఉందని తెలుసుకొని వివేక్ ఓబ్రాయ్ కి వర్కింగ్ ఇస్తాడట రామ్ చరణ్. ఇక, అప్పటి నుండి వివేక్ ఓబ్రాయ్ రామ్ చరణ్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడట. అయితే, రామ్ చరణ్ విలన్ తో వచ్చే ఇబ్బందులని ఎలా ఎదుర్కున్నాడు? అన్నది తెరపై చూడాల్సిందే!

వినయ విధేయ రామ సెన్సార్:

ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెన్సార్ సభ్యుల నుండి యూ / ఏ సర్టిఫికెట్ పొందడంతో పాటు వారి ప్రశంశలు కూడా పొందినట్లు సమాచారం. అయితే, సెన్సార్ సభ్యుల నుండి ఎలాంటి అభ్యన్తరాలు ఎదుర్కోకుండా సెన్సర్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు బోయపాటి అన్ని వర్గాలకి నచ్చే విధంగా తెరకెక్కించినట్లు సమాచారం.


Peta digital sattelite rights, పేట,Peta release date,Peta pre release business,Peta preview,Peta review,VVR star cast,VVR video songs,Peta audio,Peta censor talk, పేట రివ్యూ, పేట ప్రివ్యూ, పేట బిజినెస్,పేట పాటలు

గత సంవత్సరం విడుదలైన రెండు రజినీకాంత్ సినిమాలు కాలా, 2.0 కూడా తెలుగులో భారీ ప్లాప్లయి డిస్‌ట్రిబ్యుటర్స్ కి భారీ నష్టాన్ని తీసుకొచ్చాయి… 2.0 హింది వర్షన్ మాత్రం బ్లాక్ బస్తర్ కాగా తెలుగు తమిళ వర్షన్స్ మాత్రం నిరాశ పరిచాయి.. 

అయినా కానీ రజినీకాంత్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనటానికి ఈ నెల 10 న విడుదలవుతున్న పెట్ట బిజినెస్ నిదర్శనం.. తెలుగు లో ఈ సినిమా టైటిల్ ని “పేట” గా ఫిక్స్ చేశారు. సిమ్రన్, త్రిష తొలిసారిగా రజినీకాంత్ సరసన నటిస్తుండటం చెప్పుకోదగ్గ విషయం… ఎందుకంటే ఇంత సీనియర్ హీరోయిన్లు రజినీకాంత్ తో ఇప్పటివరకు నటించకపోవటం, అందులోనూ త్రిష రజినీకాంత్ ఫ్యాన్ అవటం కూడా విశేషమె.. ఇక ఈ సినిమాను కార్తీక్ సుబ్బారాజు దర్శకత్వం వహించాడు.. ముగ్గురు స్టార్ హీరోల సినిమాలకు పోటీగా రజినీకాంత్ పేట విడుదల చేయటం కొంత సాహశమనే చెప్పాలి… కానీ విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్ దుమ్ము రేపాయి… 90 ల్లో రజినీకాంత్ అంటూ ఫ్యాన్స్ సందడి చేసుకుంటున్నారు… చూడాలి కనీసం ఈ సినిమా అయినా రజినీకాంత్ కు తెలుగులో హిట్ అందిస్తున్‌దో లేదో…

F2 digital sattelite rights, ఎఫ్ 2, F2 release date, F2 pre release business, F2 preview, F2 review, F2 star cast, F2 video songs,F2 audio, F2 censor talk, ఎఫ్ 2 రివ్యూ, ఎఫ్ 2 ప్రివ్యూ, ఎఫ్ 2 బిజినెస్, ఎఫ్ 2 పాటలు

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ నటించిన భారీ మల్టీ స్టారర్ చిత్రం ఎఫ్2. ఈ సినిమా పై సినిమాలతో పోలిస్తే కొంత తక్కువ బజ్ ఉన్న మాట నిజమే… కానీ బహుశా ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం ఇదే ఫాస్ట్ ప్రెఫరెన్స్ కావచ్చు.. ఈ సినిమా 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది…. ఈ సినిమా నిర్మాత దిల్రాజు తో సహా ప్లాపుల్లో ఉన్న తమన్నా, మెహరీన్ ఆశలన్ని ఈ చిత్రం పైనే ఉన్నాయి… అలాగే అంతరిక్షం సినిమాకు మంచి సినిమా అనే పేరు వచ్చినా, కమర్షియల్ గా భారీ డిజాస్టర్ కావటం తో వరుణ్ తేజ్ కు కూడా ఈ సినిమా విజయం అవసరమే… ఇక అన్ని సినిమాలకు ఇప్పటికే సెన్సార్ పూర్తి అయింది…. సెన్సర్ టాక్ ప్రకారం అన్ని సినిమాలు పాసిటివ్ గానే ఉన్నాయి….

Loading...