Latest Telugu cinema News

Natana Movie Review | నటన మూవీ రివ్యూ

Telugu movie news

Natana Movie Review | నటన మూవీ రివ్యూ | నూతన నటులు మహీధర్, శ్రావ్య రావు జంటగా నటించిన తాజా చిత్రం “నటన”. భారతి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటుడు భానుచందర్ అలాగే రంగు బాబు, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ ఫణి ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్రం అన్ని కార్యక్రమాలని ముగించుకొని జనవరి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు మన సమీక్షలో చూద్దాం సినిమా ఎలా ఉందొ!

Natana Telugu Movie
Natana Telugu Movie

నటీనటులు మరియు సాంకేతిక వర్గం:
నటీనటులు: మహీధర్, శ్రావ్య రావు, రఘు బాబు, బాను చందర్, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ ఫనీ, తదితరులు.
దర్శకత్వం: భారతి బాబు
నిర్మాత: కుభేర ప్రసాద్
సంగీతం: ప్రభాకర్ ప్రవీణ్
సినిమాటోగ్రఫీ: వాసు
ఎడిటర్: నాగేశ్వర్ రెడ్డి
విడుదల తేదీ: జనవరి, 04, 2019

కథ:
ఇక సినిమా కథ విషయానికి వస్తే, శ్రీ రామ్ (మహీధర్) చిన్నప్పటి నుండి సినిమా హీరో కావాలని కళలు కంటుంటాడు. ఇక, తన ఫ్రెండ్ తో కలిసి సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో జానకి (శ్రావ్య రావు) తో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే, సినిమాల్లో ట్రైలర్ చేతున్న శ్రీ రామ్ ఆర్కే (రఘు బాబు) చేత మోసపోతాడు. అయితే, చివరికి హీరో అయ్యాడా? అతను ఎదుర్కున్న సమస్యలేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Natana Telugu Movie
Natana Telugu Movie Review

ప్లస్ పాయింట్స్:
మహీధర్, శ్రావ్య రావు నటన
బాను చందర్ పాత్ర
నటీనటుల పనితీరు

మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్
కథ, కథనం,
డైరెక్షన్
లాజిక్ లేని సన్నివేశాలు

Natana New Telugu Movie Review
Natana New Telugu Movie Review

విశ్లేషణ:
ఇక సినిమాలో నటీనటుల విషయానికి వస్తే, శ్రీ రామ్ అనే పాత్రలో హీరో మహీధర్ ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. అలాగే, జానకి పాత్రలో నటించిన హీరోయిన్ అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటుంది. ఇకపోతే, సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించిన రఘు బాబు, బాను చందర్, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ ఫనీ వారి పాత్రలకి తగ్గట్లు బాగానే నటించించారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలో
భానుచందర్ తదైనా శైలిలో నటించి అందరిని మెప్పిస్తాడు.

Actress Sravya Rao From Natana Telugu Movie
Actress Sravya Rao From Natana Telugu Movie

ఇక, దర్శకుడు యువతకి నచ్చే కథాంశాన్ని ఎంచుకున్నప్పటికీ, దాన్ని తెరకెక్కించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. తెలుగులో చాల సినిమాలకి రైటర్ గా పనిచేసిన భారతి బాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. అయితే, ఈ చిత్రాన్ని అనుకున్నంత సక్సెస్ చేయలేకపోయారు.ఇక, ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు పెద్దగా పండకపోవడం. అలాగే సెకండ్ హాఫ్ లో లాజిక్ లేని సన్నివేశాలు ప్రేక్షకులకి విసుగు తెప్పిస్తాయి. మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఉండబోతుందో చూడాలి!

Also Read:

చీకటి గదిలో చితక్కొట్టుడు టీజర్ : తెలుగులో మరో అడల్ట్ మూవీ (వీడియోతో)

హస్తప్రయోగం కాన్సెప్ట్ తో తెలుగు సినిమా ….ఫుల్ స్టోరీ …

ఆది సెక్స్ కాదట… లవ్ అట…లీకైన సీనుపై ఆశాషైని కామెంట్

వైరల్ అయిన అదా శర్మ న్యూ ఇయర్ డ్యాన్స్ వీడియో

బూతు శాతం పెంచేసిన ఆశాషైనీ గంధి బాత్ 2 (వీడియో తో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Movie news, Gossips, Movie reviews, Box office collections, Actress stills, Movie gallery, Movie trailers, Movie teasers, Tollywood, Bollywood, Hollywood, Kollywood, Sandalwood, Mollywood